తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియా టూర్ ఎఫెక్ట్ - 'యో యో' టెస్ట్ ఈజ్ బ్యాక్​! - ప్లేయర్లను రాటు తేల్చేందుకు విరాట్​ రూల్​! - YO YO TEST TEAM INDIA

ఫిట్​నెస్ లెవెల్స్ చెక్​ చేసేందుకు యోయో టెస్ట్ -ఆస్ట్రేలియా టూర్ ఎఫెక్ట్​తో మళ్లీ అమల్లోకి

Yo Yo Test Team India
Yo Yo Test Team India (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Jan 16, 2025, 12:44 PM IST

Yo Yo Test Team India :తమ సభ్యుల్లోని ఫిట్​నెస్​ లెవెల్స్ తెలుసుకునేందుకు టీమ్ఇండియా ఒకప్పుడు యో యో టెస్టును నిర్వహించేది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఈ టెస్ట్​ను వారు క్రమం తప్పకుండా పాటించేవారు. అయితే, అది చాలా కఠినంగా ఉందని, దాని కారణంగా ప్లేయర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనే వ్యాఖ్యలు రావడం వల్ల బీసీసీఐ దాన్ని కొంతకాలంగా పక్కన పెట్టేసింది. అయితే త్వరలోనే మళ్లీ ఈ రూల్​ అమల్లోకి వచ్చేలా బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెటర్ల ఫిట్‌నెస్‌ ఇప్పుడు అత్యంత కీలకంగా అవ్వడం వల్లనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనుందట.

ఆస్ట్రేలియా టూర్​లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమ్ఇండియాను మళ్లీ ఫామ్​లోకి తెచ్చేందుకు బీసీసీఐ పలు మార్పులను చేసేందుకు ప్రారంభించింది. ఈ క్రమంలో ప్లేయర్ల ఫిట్‌నెస్‌ విషయంలోనూ కఠినంగానే వ్యవహరించనుంది. అయితే 'యో యో' టెస్టు నిర్వహించాలని వైద్యబృందం నుంచి సూచనలు వచ్చాయని వార్తలూ జోరుగానే వినిపిస్తున్నాయి.

"ఇప్పటివరకు క్రికెటర్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతుండటం వల్ల బోర్డు ఉదాసీనంగా వ్యవహరించింది. కానీ ఇప్పుడు గాయాలు కూడా ఇబ్బందికి గురి చేసే అంశంగా మారింది. ఫిట్‌నెస్‌ విషయాన్ని కొందరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అందుకే, ఫిట్‌నెస్‌ లెవెల్స్​ను తెలుసుకునేందుకు అవసరమైన టెస్టును మళ్లీ తీసుకురావాలని భావిస్తోంది" అని బీసీసీఐ క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.

ఎక్స్​ట్రా బ్యాటింగ్ కోచ్‌ కూడా!
మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సీనియర్‌ ప్లేయర్లైన రోహిత్, విరాట్ కోహ్లీ పేలవ ఫామ్​ను కనబరిచారు. జట్టును కాపాడటంలో దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో హెడ్​ కోచ్ గంభీర్‌ తమ టీమ్​లోకి ఓ ఎక్స్​ట్రా బ్యాటింగ్‌ కోచ్‌ను తీసుకోవాలని భావిస్తోన్నట్లు సమాచారం. అయితే, ఈ ఇది ఓ ప్రపోజల్‌ స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

ఇదిలా ఉండగా, గంభీర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌, కివీస్‌, ఆసీస్‌ జట్లతో టెస్టు సిరీస్‌ల్లో భారత్‌ ఓటమిని చవి చూసింది. బౌలింగ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా రాణించినప్పటికీ, మిగతా బౌలర్ల పెర్ఫామెన్స్ అంతంతమాత్రంగానే ఉంది. ఇటు బ్యాటింగ్‌ విభాగం కూడా తీవ్ర నిరాశ పరుస్తోంది. దీంతో పలు మార్పులు చేయాలని బోర్డు భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల మాట.

BCCI నయా రూల్స్- గంభీర్​ గొంతెమ్మ కోరికలు కట్! ప్లేయర్లకూ ఆ ఛాన్స్​ లేనట్టే!

2024లో భారీగా పెరిగిన బీసీసీఐ ఆదాయం - ఐపీఎల్‌ వ్యూవర్‌షిప్‌తో రూ.4200 కోట్ల లాభం!

ABOUT THE AUTHOR

...view details