Yashasvi Jaiswal Test Record:ఇంగ్లాండ్‌తో జరగుతున్న టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన యశస్వి, నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరో హాఫ్ సెంచరీతో (73 పరుగులు) రాణించాడు. ఈ క్రమంలో టెస్టు కెరీర్లో ఓ అరుదైన ఘనత సాధించాడు.
ప్రస్తుత సిరీస్‌లో యశస్వి ఇప్పటికే 7 ఇన్నింగ్స్‌ల్లో 618 పరుగులు బాదాడు. ఈ క్రమంలో ఓ టెస్టు సిరీస్‌లో 600+ పరుగులు నమోదు చేసిన ఐదో బ్యాటర్‌గా రికార్డు కొట్టాడు. ఇదివరకు టీమ్ఇండియాలో దిలీప్ సర్దేశాయ్, సునీల్ గావస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ ఈ ఘనత అందుకున్నారు. కాగా, గావస్కర్, విరాట్ తమ కెరీర్లో రెండుసార్లు ఈ ఫీట్ సాధించారు.
1970- 71లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో దిలీప్ సర్దేశాయ్, సునీల్ గావస్కర్ (774 పరుగులు) ఈ ఘనత అందుకున్నారు. ఇక 1978- 79లో మళ్లీ విండీస్‌పైనే గావస్కర్ 732 పరుగులు చేశాడు. టెస్టు సిరీస్‌లో భారత్ తరఫున 700+ పరుగులు చేసిన బ్యాటర్ గావస్కరే. ఇక టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ సిరీస్‌లో అత్యధిక పరుగుల బాదిన రికార్డ్ ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ డొనాల్ట్ బ్రాడ్‌మన్ (974 పరుగులు) పేరిట ఉంది. అతడు ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు.