Yashasvi Jaiswal T20 World Cup :యూఎస్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే సన్నాహాకాలు మొదలవుతున్నాయి. ఓ వైపు మేనేజ్మెంట్ ఓపెనింగ్ మ్యాచ్ కోసం అన్ని రెడీ చేస్తుండగా, ప్లేయర్లు కూడా వేదికకు చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులో భాగంగానే భారత్ జట్టు కూడా ఇప్పటికే అమెరికా చేరి సందడి చేస్తోంది. జూన్ 5న తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సంసిద్ధమవుతోంది.
అంతకంటే ముందు టీమ్ఇండియా ఒక వార్మప్ మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంది. దీంతో మన క్రికెటర్లు నెట్స్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అయితే, బ్రేక్ టైమ్‌లో వాళ్లలోని కొందరు అలా న్యూయార్క్ వీధుల్లో కాసేపు చక్కర్లు కొట్టారు. తాజాగా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ కూడా న్యూయార్క్‌ను ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేశాడు. అయితే ఫ్యాన్స్ ఈ ఫొటోను షేర్ చేస్తూ నెటిజన్లు సరదగా కామెంట్స్ పెడుతున్నారు.