Yashasvi Jaiswal AUS vs IND : సిడ్నీ వేదికగా జరుగుతోన్న చివరి టెస్ట్‌లో భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆడుతోంది. నాలుగు పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా తొలి ఓవర్‌లోనే అదిరిపోయే ఓపెనింగ్ అందించింది. ఆసీస్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లో జైస్వాల్ నాలుగు బౌండరీలతో చెలరేగిపోయాడు. ఈ ఒక్క ఓవర్‌లోనే అతడు 16 పరుగులు సాధించాడు. దీంతో టెస్టుల్లో మొదటి ఓవర్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా జైస్వాల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ 22 పరుగుల వద్ద స్కాట్ బోలాండ్ బౌల్డ్ చేతికి చిక్కాడు.
నాలుగో భారత బ్యాటర్‌గా
ఇదిలా ఉండగా, అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత జైస్వాల్‌కు ఇదే ఫస్ట్ ఆస్ట్రేలియా టూర్ కావడం విశేషం. పెర్త్ టెస్టులో నమోదు చేసిన సెంచరీతో పాటు ఐదు టెస్టుల్లో 43.44 సగటుతో 391 పరుగులు సాధించాడు ఈ కుర్రాడు. టీమ్ఇండియా తరఫున టాప్ స్కోరర్ కాగా, అంతకంటే ముందు ఈ లిస్ట్‌లో 414* పరుగులతో ట్రావిస్ హెడ్ ఉన్నాడు. అయితే తొలి సిరీస్‌లోనే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా జైస్వాల్ రికార్డుకెక్కాడు. ఇక మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (1977/78 సీజన్) 450 పరుగులు, వీరేంద్ర సెహ్వాగ్ (2003/04) 464 పరుగులు, మురళీ విజయ్ (2014/15) 482 పరుగులు సాధించారు.