WPL 2024 RCB Smriti Mandhana Boyfriend :మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ 2024 టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కైవసం చేసుకుంది. దీంతో ఆ జట్టు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశంలోని ప్రతి మూలల నుంచి అభిమానులు ఆర్సీబీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఉన్న ఆర్సీబీకి ఇదొక పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. పురుషుల జట్టు 16 ఏళ్లలో సాధించని ఫీట్‌ను మహిళల జట్టు సాధించింది.అయితే ఇప్పుడు ఆర్సీబీ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న ఒక్కటి ఉంది. టైటిల్‌తో కెప్టెన్ స్మృతి మందాన భుజంపై చేయి వేసి నిల్చున్న ఆ కుర్రాడు ఎవరు? స్మృతి బాయ్‌ఫ్రెండ్, సోదరుడా? స్నేహితుడా? ఇలా చాలా ప్రశ్నలే మొదలయ్యాయి. ఆర్సీబీ మాజీ ఆటగాడు అయిన యుజ్వేంద్ర చాహల్ కూడా స్మృతితో పాటు ఆ యువకుడి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పంచుకున్నారు.
అయితే ఆ యువకుడు ఎవరనే వెతుకులాట అభిమానులను బాలీవుడ్ వరకు తీసుకెళ్లింది. స్మృతిపై చేయి వేసి నిల్చున్న ఆ కుర్రాడు బాలీవుడ్ సింగర్ పాలక్ ముచల్ సోదరుడు పలాష్ ముచల్ అని గుర్తించారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గతంలో రూమర్స్ వచ్చినా ఇంతవరకు ఇద్దరూ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలాష్ బర్త్ డే పార్టీకి స్మృతి వచ్చిన వీడియో అంతకుముందు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా, సీ ఫైవ్‌లో ప్రసారమైన ఆర్త్ అనే వెబ్ సిరీస్‌కు గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ కూడా దర్శకత్వం వహించారు.
ఈయన - ఆర్సీబీ కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత, పలాష్ ఈ సాలా కప్ నమ్ దే అంటూ హార్ట్ ఎమోజీతో పాటు ఇన్ స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేశారు. గత సంవత్సరం జూలైలో, పలాష్ స్మృతితో ఒక ఫొటోను షేర్ చేసింది. దానిని #4గా ట్యాగ్ చేసింది. దీంతో వారిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారని అర్థమవుతోందని అప్పట్లో ఒకటే గుసగుసలు వినిపించాయి.