Shafali Verma 200:టీమ్ఇండియా మహిళల జట్టు యంగ్ బ్యాటర్ షఫాలీ వర్మ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. చెన్నై వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో మహిళల క్రికెట్లోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించింది. షఫాలీ 194 బంతుల్లోనే 200 మార్క్ అందుకుంది. ఈ క్రమంలో ఆసీస్ బ్యాటర్ అనబెల్ (248 బంతుల్లో) రికార్డ్‌ను షఫాలీ బ్రేక్ చేసింది.
కాగా, టీమ్ఇండియా నుంచి టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచింది. 2002లో అప్పటి భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ మార్క్ అందుకుంది. అంటే దాదాపు 22ఏళ్ల తర్వాత మహిళల క్రికెట్లో టీమ్ఇండియా బ్యాటర్ డబుల్ సాధించింది. ఇక షఫాలీ ఓవరాల్‌గా ఉమెన్స్ క్రికెట్లో టెస్టు డబుల్ సెంచరీ సాధించిన 10వ బ్యాటర్‌గా నిలిచింది.
స్మృతి జస్ట్ మిస్
ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్ స్మృతి మంధాన కూడా రఫ్పాడించింది. షఫాలీతో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. ఈ మ్యాచ్‌లో మంధాన 149 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఒక్క పరుగు తేడాతో కెరీర్లో తొలి 150 మిస్ చేసుకుంది. వీరిద్దరు తొలి వికెట్‌కు 292 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. ఇది మహిళల టెస్టు క్రికెట్లో అత్యధిక తొలి వికెట్ పార్ట్నర్షిప్.