Womens T20 World Cup 2024 :ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్లకు వేదికలు ఖరారయ్యాయి. యూఏఈ (UAE)లోని షార్జా క్రికెట్ స్టేడియం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించనున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. కాగా అక్టోబరు 03 - 20 వరకు యూఏఈలో మహిళల టీ20 వరల్డ్కప్ జరగనుంది. సెప్టెంబరు 28- అక్టోబర్ 1 వరకు వార్మప్ మ్యాచ్లు జరగనున్నాయి.
రెండు గ్రూపులు
ఈ వరల్డ్ కప్‌లో పాల్గొనే మొత్తం 10 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ Aలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్ Bలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి.
ఒక గ్రూప్ లోని ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్- 2లో నిలిచిన జట్లు సెమీస్ చేరుతాయి. అక్టోబరు 17, 18వ తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. అదే నెల 20న దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్ జరగనుంది.
రోజుకు రెండు మ్యాచ్లు
అక్టోబరు 3న రెండు ఈ వరల్డ్కప్ ప్రారంభమవుతుంది. బంగ్లాదేశ్- స్కాట్లాండ్, పాకిస్థాన్- శ్రీలంక జట్లు షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా తొలి రెండు మ్యాచ్ల్లో తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అక్టోబర్ 4న దక్షిణాఫ్రికా- వెస్టిండీస్, భారత్- న్యూజిలాండ్ మధ్య మ్యాచులు జరగనున్నాయి. కాగా టీమ్ఇండియా అక్టోబర్ 4న న్యూజిలాండ్, 6న పాకిస్థాన్, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది.