Actor Rana Women T20 World Cup 2024 : యూఏఈ వేదికగా టీ20 మహిళా ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహిళల టీమ్ ఇండియా జట్టు అక్కడికి చేరుకుంది. అయితే దుబాయ్‌లో మహిళా క్రికెటర్లు దిగిన వేళ అక్కడ వారికి ఓ స్పెషల్ గెస్ట్ ఎదురయ్యారు.
ఆయన మరెవరో కాదు సినీ నటుడు దగ్గుబాటి రానా. ఈయన కూడా దుబాయ్‌కు వెళ్లారు. అదే సమయంలో భారత మహిళా క్రికెటర్లు ఆయనకు తారసపడ్డారు. దీంతో రానా వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. టీ20 ప్రపంచ కప్‌ను పట్టుకురావాలని ఆకాంక్షించాడు.
ఆ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యేకంగా పోస్టు చేసింది. "ఎయిర్ పోర్ట్‌లో అద్భుతమైన వ్యక్తులను కలిశాను. భారత్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్" అంటూ రానా చేసిన కామెంట్స్ ఆ వీడియోలో వినిపించాయి.
వారందరికీ ఫ్రీ - ముందుగా ప్రిపేర్ చేసిన షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ వేదికగా ఈ పొట్టి కప్ జరగాలి. కానీ ఆ దేశంలో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో టోర్నీని యూఏఈకి మార్చింది ఐసీసీ. అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న మహిళా టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూసేందుకు ఐసీసీ ఓ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. 18 ఏళ్ల లోపు వారందరికీ ఉచిత ఎంట్రీ ప్రకటించింది.
ఇప్పటికే టికెట్ల అమ్మకాలను కూడా ప్రారంభించింది. టికెట్ల ధరలు చాలా తక్కువగా నిర్ణయించింది. కేవలం రూ. 114 (ఐదు దిర్హామ్‌లు) నుంచే ధరలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. ఒకే రోజు రెండు మ్యాచ్‌లు జరిగే సమయంలోనూ ఒక టికెట్ మీదే వాటిని చూసే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఐసీసీ ఓ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లను కొనుగోలు చేసేందుకు దుబాయ్, షార్జా స్టేడియాల వద్ద కియోస్క్‌లను ఏర్పాటు చేసింది.
మెగా వేలంలోకి 5 స్టార్ ప్లేయర్స్! - ఏ ఫ్రాంఛైజీ ఎవరిని వదులుకుంటుందంటే? - IPL 2025 Mega Auction
బంగ్లాతో రెండో టెస్టు - మూడో స్పిన్నర్ అతడేనా? - IND VS BAN Second Test Spinners