Wanindu Hasaranga IPL 2024:సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ తగిలింది. జట్టు స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగ గాయం కారణంగా 2024 ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు తాజాగా వెల్లడించింది. ఈ మేరకు లంక క్రికెట్ బోర్డు బీసీసీఐకి లేఖ రాసింది. ఇక హసరంగా స్థానంలో మరో ప్లేయర్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఎడమ కాలి గాయం కారణంగా కొన్ని రోజులుగా ఆటకు దూరమైన హసరంగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే త్వరలోనే సన్‌రైజర్స్ క్యాంప్‌లో చేరతాడని ఇటివల ఫ్రాంచైజీ యాజమాన్యం భావించింది. హసరంగ ట్రీట్మెంట్ రిపోర్స్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు సన్‌రైజర్స్ కోచ్ డేనియల్ విటోరీ రీసెంట్గా తెలిపిన నేపథ్యంలో తాజా వార్త ఆ జట్టు అభిమానలను కాస్త నిరాశకు గురిచేస్తోంది. ఇక ప్రస్తుతం దుబాయ్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న హసరంగకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో అతడు జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఆడడం డౌటే అంటున్నారు. కాగా, గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో సన్‌రైజర్స్ అతడిని రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇక ప్రస్తుత టోర్నీలో ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తోంది. ఐపీఎల్లో హిస్టరీలోనే స్టార్ జట్లు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను సొంత గడ్డ ఉప్పల్‌లో ఓడించి సత్తా చాటింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ త్రుటిలో (4 పరుగుల తేడాతో ఓడింది) విజయాన్ని చేజార్చుకుంది. ఇక ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ రెండింట్లో నెగ్గి ప్రస్తుతం 4 పాయింట్లతో పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది.