ODI World Cup 2023 India : టీమ్ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ గుండె బద్దలై ఏడాది గడిచింది. సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు కోట్లాది మంది భారతీయుల కల చెదిరిపోయింది. 12ఏళ్ల తర్వాత భారత్ మూడోసారి వన్డే వరల్డ్ కప్ ముద్దాడతుందనుకుంటే అది ముచ్చటగానే మిగిలిపోయింది. 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఫలితం చూసి మైదానం అంతా నిశబ్దంగా మారిపోయింది. భారత ప్లేయర్లు సహా కోట్లాది మంది కంటతడి పెట్టారు.
19 ననంబర్ 2023 అహ్మదాబాద్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య మెగా టోర్నీ ఫైనల్ జరిగింది. ఆ టోర్నీలో అప్పటికే వరుసగా 10 మ్యాచ్‌లు నెగ్గిన టీమ్ఇండియా టైటిల్ నెగ్గుతుందనడంలో ఫ్యాన్స్‌కు ఎలాంటి సందేహాల్లేవ్! పైగా కెప్టెన్ రోహిత్ శర్మ సహా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ లాంటి పేస్ గన్లు టీమ్ఇండియా సొంతం. ఇక 12ఏళ్ల కల సాకారం అవ్వడం పక్కా అని అభిమానలు, సంబరాలకు సిద్ధమైపోయారు.
కల చెదిరే- కప్పు చేజారే
కానీ, ఆ ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా టీమ్ఇండియా ఓడింది. బ్యాటింగ్ జోరుగానే ప్రారంభించినప్పటికీ, ఇన్నింగ్స్ సాగుతున్నా కొద్దీ పరుగుల వేగం నెమ్మదించింది. తొలి 10 ఓవర్లలో 80 పరుగులు రాగా, తర్వాత 40 ఓవర్లలో టీమ్ఇండియా 160 పరుగులే చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 240-10 స్కోర్ నమోదు చేసింది. అనంతరం ఆసీస్ ఛేదనలో ఆరు ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయినా, ట్రావిస్ హెడ్ ఆ జట్టును ఆదుకున్నాడు. సూపర్ సెంచరీ (137 పరుగులు)తో ఆసీస్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. 43 ఓవర్లలోనే ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించి విశ్వ విజేతగా అవతరించింది. అంతే టీమ్ఇండియా ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యింది. సీనియర్లు రోహిత్, విరాట్ గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ మ్యాచ్ భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు ఓ పీడకలగా మిగిలిపోయింది.
2024 was the T20 WorldCup year but idk why for some reason it still was not able to heal me from this 19th Nov heartbreak...! Agree..?#INDvsAUS pic.twitter.com/9dY2fSJ20N
— Pufaddal Bohra (@Pranjal81111995) November 18, 2024
India lost 2023 ICC Odi World cup final. pic.twitter.com/XZ3mjisKjj
— Proshanto Acharjee (@AjProsanta) November 13, 2024
వరల్డ్ కప్ ట్రోఫీకి అవమానం- మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు- జీవితకాల నిషేధం!
వరల్డ్‌కప్ ట్రోఫీపై కాళ్లేసి ఫోజులు- మార్ష్‌పై నెటిజన్లు ఫైర్ - ఇండియన్స్‌ను చూసి నేర్చుకోవాలంటూ!