తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెహ్వాగ్​ VS రోహిత్ - ఇద్దరు ఓపెనర్లలో అత్యుత్తమ ప్లేయర్ ఎవరంటే? - Virender Sehwag VS Rohit Sharma - VIRENDER SEHWAG VS ROHIT SHARMA

Virender Sehwag VS Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్లుగా రోహిత్ శర్మ అలాగే వీరేంద్ర సెహ్వాగ్ వారి వారి కాలంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎన్నో రికార్డులను నెలకొల్పారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే?

Virender Sehwag VS Rohit Sharma
Virender Sehwag VS Rohit Sharma (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Sep 7, 2024, 1:22 PM IST

Virender Sehwag VS Rohit Sharma : టీమ్ఇండియా క్రికెట్ టీమ్​లో ఇప్పటివరకూ ఆడిన ప్లేయర్లలో రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ తమ తమ టీమ్స్​లో అత్యుత్తమ ప్లేయర్స్. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్​గా సెహ్వాగ్ క్రీజులోకి దిగాడంటే, ఇక పెద్ద పెద్ద బౌలర్లు కూడా బెంబేలెత్తిపోతారు. దూకుడైన షాట్లతో అద్భుతాలు చేయడం సెహ్వాగ్​ స్పెషాలిటీ. అందుకారణంగా అతడు తను తనతో పాటు ఆ సమయంలో ఆడిన ప్లేయర్లలో మేటిగా నిలిచాడు. క్రికెట్ ప్రపంచాన్ని శాసించి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే ఇప్పటికాలంలో అంతటి దూకుడుగా ఆడి జట్టుకు ఎన్నో అత్యద్భుమైన ఇన్నింగ్స్​ను అందించిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అందరికీ ఠక్కున రోహిత్ శర్మ పేరు గుర్తొస్తుంది. ఇతడు కూడా ఓపెనర్​గా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. మిచెల్ స్టార్క్, టిమ్ సౌథీ, జేమ్స్ అండర్సన్ వంటి పవర్​ఫుల్ బౌలర్లను తన బ్యాటింగ్ స్కిల్క్​తో చిత్తు చేశాడు. బాల్​ను బౌండరీ దాటించి హిట్​మ్యాన్​గా పేరందాడు. అయితే ఈ ఇద్దరూ దూకుడైన ఓపెనర్లే అయినప్పటికీ, ఇద్దరి మధ్యలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి అవేంటంటే :

వీరేంద్ర సెహ్వగ్ ఇప్పటివరకూ టీమ్ఇండియా తరఫున 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 16,119 పరుగులు చేశాడు. అతడి సగటు 41.54 అయితే, అతడి స్ట్రైక్ రేట్ 93.0. ఇక తన కెరీర్​లో 36 సెంచరీలు 67 అర్ధ సెంచరీలు చేశాడు మరియు అతని అత్యధిక స్కోరు 319. సెహ్వాగ్ 2245 ఫోర్లు, 227 సిక్సర్లు కొట్టాడు.

రోహిత్ ఇప్పటి వరకు 354 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 15,138 పరుగులు చేశాడు. అతడి సగటు 46.57 కాగా, స్ట్రైక్ రేట్ 93.46. ఇందులో 43 సెంచరీలు ఉండగా, 78 అర్ధ సెంచరీలు కూడా ఉండటం విశేషం. అతని అత్యధిక స్కోరు 264 కాగా, తన కెరీర్​లో రోహిత్ 1522 ఫోర్లు, 539 సిక్సర్లు కొట్టాడు.

ఇప్పుడీ ఈ గణాంకాలను చూస్తుంటే వీరేంద్ర సెహ్వాగ్‌తో పోలిస్తే రోహిత్ శర్మ చాలా విషయాల్లో ముందంజలో ఉన్నాడు. అంతేకాకుండా రోహిత్‌ క్రికెట్ కెరీర్​ను ఇంకో నాలుగేళ్లు కొనసాగించినా కూడా తన గణాంకాలను మరింత మెరుగుపరుచుకోవడానికి అతడి వద్ద ఉందని క్రికెట్ విశ్లేషకుల మాట.

'ధోనీ సేన కంటే రోహిత్‌ జట్టులోనే మ్యాచ్‌ విన్నర్లు ఎక్కువగా ఉన్నారు' - Harbhajan Singh T20 World Cup 2024

క్రికెటర్ నుంచి బ్యాంకర్‌గా మారిన సెహ్వాగ్ టీమ్‌మేట్ ఎవరంటే? - Virender Sehwag Cricket Friend

ABOUT THE AUTHOR

...view details