Virat Kohli Batchmates T20s:2024 టీ20 వరల్డ్‌కప్‌లో విజయంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అయితే కోహ్లీతో పాటు U-19 ఆడిన చాలా మంది ప్లేయర్‌లు ఇంకా టీ20 ఫార్మాట్‌లో రాణిస్తున్నారు. విరాట్ కోహ్లి U-19 ప్రపంచకప్ బ్యాచ్‌మేట్స్‌లో ఇప్పటికీ T20ల్లో యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్స్ ఎవరో చూద్దాం.
- మనీష్ పాండే:మనీష్ పాండే కూడా టీ20ఐలకు అందుబాటులో ఉన్నాడు. ప్రస్తుతం టీమ్ ఇండియాలో భాగం కాకపోయినా రిటైర్‌మెంట్ ప్రకటించలేదు. ఐపీఎల్‌లో కొనసాగుతున్న మనీష్ పాండే, ఫామ్ అందుకుంటే భారత జట్టులో సులువుగానే చోటు సంపాదించగలడు.
- స్టీవ్ స్మిత్:టెస్ట్ స్పెషలిస్ట్‌గా ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ, స్టీవ్ స్మిత్ ఇప్పటికీ ఆస్ట్రేలియా తరపున T20Iలు ఆడుతున్నాడు. అతని టెక్నిక్, షార్ప్ క్రికెటింగ్ మైండ్‌తో పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటికీ కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.
- కేన్ విలియమ్సన్:న్యూజిలాండ్ కెప్టెన్ టీ20ల్లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తన స్ట్రాటజీలకు ప్రసిద్ధి చెందిన విలియమ్సన్, ఇంకా టీ20ల నుంచి రిటైర్ కాలేదు.
- మార్కస్ స్టాయినిస్:ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టాయినిస్ టీ20ల్లో ఇంకా రాణిస్తున్నాడు. ఇటు పవర్ హిట్టింగ్, అటు మీడియం పేస్‌తో ఆకట్టుకుంటున్నాడు. టీ20ఐల్లో ఇప్పటికీ స్టాయినిస్ కీలక ప్లేయర్.
- జోష్ హేజిల్‌వుడ్:ఆస్ట్రేలియా టాప్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ టీ20ఐ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికీ పేస్, అక్యురసీతో బ్యాటర్లకు సవాలు విసురుతున్నాడు.
- అహ్మద్ షెహజాద్:పాకిస్థాన్ ప్లేయర్ అహ్మద్ షెహజాద్ టీ20 కెరీర్ ఆశించిన స్థాయిలో కొనసాగలేదు. అటాకింగ్ బ్యాటింగ్‌కి పాపులర్ అయిన హెషజాద్‌కి ఎక్కువగా టీ20 అవకాశాలు లభించడం లేదు. అతడు ఇంకా టీ20ల నుంచి రిటైర్ కాలేదు.
- ఇమాద్ వసీం:టీ20ల్లో పాకిస్థాన్‌కి ఉన్న టాప్ ఆల్‌రౌండర్స్‌లో ఇమాద్ వసీం ఒకడు. లోయర్ ఆర్డర్‌లో భారీ హిట్టింగ్ చేయగల సామర్థ్యం, స్పిన్‌తో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వాస్తవానికి అతడు రిటైర్మెంట్ నుంచి తిరిగొచ్చి 2024 టీ20 ప్రపంచ కప్‌లో ఆడాడు.
- రిలీ రోసోవ్:దక్షిణాఫ్రికాకు చెందిన రిలీ రోసోవ్ కూడా టీ20 ఫార్మాట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించలేదు. ఈ స్టార్ ఓపెనర్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాడు.
- జేమ్స్ ఫాల్క్‌నర్:టీ20ల్లో ఆస్ట్రేలియా ప్లేయర్ జేమ్స్ ఫాల్క్‌నర్ కొనసాగుతున్నాడు. డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఫాల్క్‌నర్, బ్యాట్‌తో కూడా మాయ చేయగలడు. అతడికి చాలా కాలంగా టీ20 జట్టులో స్థానం లభించలేదు. అయినా, ఇంకా టీ20ల నుంచి రిటైర్ కాలేదు.
- టిమ్ సౌథీ:న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌథీకి టీ20ల్లో చాలా అనుభవం ఉంది. ఇప్పటికీ జట్టులో స్వింగ్ బౌలర్‌గా చోటు సంపాదిస్తున్నాడు
- క్రిస్ వోక్స్:ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ T20I జట్టులో కీలక ఆల్ రౌండర్. బాల్, బ్యాట్ రెండింటితో టీమ్‌కి ఉపయోగపడుతాడు. ఇప్పటికీ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.