తెలంగాణ

telangana

అత్యంత విలువైన సెలబ్రిటీగా కోహ్లీ - ఆ ఇద్దరు స్టార్స్​ను వెనక్కినెట్టి! - Kohli Most Valued Celebrity

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 6:40 PM IST

Most Valued Celebrity Kohli : ఇండియాలో అత్యంత విలువైన సెలబ్రిటీ తానేనని విరాట్‌ కోహ్లి నిరూపించుకున్నాడు. పూర్తి వివరాలు స్టోరీలో

source Getty Images and ANI
kohli Sharukh Khan (source Getty Images and ANI)

Most Valued Celebrity Kohli :టీమ్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లీ పాపులారిటీ, క్రేజ్‌ మరోసారి రుజువు అయింది. విరాట్​ మరోసారి బాలీవుడ్‌ బడా స్టార్లను వెనక్కి నెట్టి అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచాడు. షారుఖ్ ఖాన్, రణ్‌వీర్ సింగ్‌ను అధిగమించి దేశంలోనే టాప్‌ ప్లేస్‌ సొంతం చేసుకున్నాడు. క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం, కోహ్లీ బ్రాండ్ విలువ 29% పెరిగి $227.9 మిలియన్లకు చేరుకుంది. ఈ పెరుగుదలతో భారత్‌లోని అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో విరాట్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు.

  • లిస్టులోని టాప్‌ ఫైవ్‌ సెలబ్రిటీలు వీళ్లే
    విరాట్ కోహ్లీ ఎండార్స్‌మెంట్ విభాగంలో దూసుకెళ్తున్నాడు. ఏకంగా $227.9 మిలియన్ల బ్రాండ్ వ్యాల్యూ కలిగి ఉన్నాడు. తర్వాత $203.1 మిలియన్ బ్రాండ్ వ్యాల్యూతో రణవీర్ సింగ్ రెండో ప్లేస్‌లో నిలిచాడు. గతంతో పోలిస్తే రణ్‌వీర్‌ సింగ్‌ వ్యాల్యూ కాస్త తగ్గింది. అదే షారూక్​ ఖాన్ బ్రాండ్‌ వ్యాల్యూ పెరిగింది. $120.7 మిలియన్ల బ్రాండ్ వ్యాల్యూతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ గణాంకాలు షారుక్​ క్రేజ్​, మార్కెట్‌ను హైలైట్ చేస్తున్నాయి. మరో స్టార్‌ హీరో అక్షయ్ కుమార్ నాలుగో ప్లేస్‌ దక్కించుకున్నాడు. $111.7 మిలియన్ల బ్రాండ్‌ వ్యాల్యూ పొందాడు.
  • సచిన్‌ తెందూల్కర్‌ పొజిషన్‌ ఏంటి?
    ఐదో స్థానంలో పాపులర్‌ బాలీవుడ్‌ హీరోయిన్ అలియా భట్ నిలిచింది. ఆమె బ్రాండ్‌ వ్యాల్యూ ఏకంగా $101.1 మిలియన్లు కావడం గమనార్హం. ఎండార్స్‌మెంట్ రంగంలో అలియా బ్రాండ్‌ వ్యాల్యూ తనకున్న క్రేజ్‌, రీచ్‌ను సూచిస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ 81.7 మిలియన్‌ డాలర్ల వ్యాల్యూతో ఒక స్థానం మెరుగుపరచుకుని పదో ప్లేస్‌లో ఉన్నాడు. మరో స్టార్‌ క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌ 91.3 మిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో లిస్టులో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

    క్రోల్‌, వాల్యుయేషన్ అడ్వైజరీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అవిరాల్ జైన్ మాట్లాడుతూ, ‘2023లో, బాలీవుడ్ అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలతో $100 మిలియన్లకు పైగా సంపాదించింది. ఈ సక్సెస్‌ ఇండియన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో బాలీవుడ్‌ను తిరిగి టాప్‌ పొజిషన్‌లో నిలిపింది.‘ అని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details