తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరాట్ LBW కాంట్రవర్సీ - రోహిత్ రియాక్షన్ వైరల్- ఔటా, నాటౌటా? - Ind vs Ban Test Seires 2024

Virat Kohli LBW : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ ఔటైన తీరు చర్చనీయాంశమైంది. దీనికి రోహిత్‌, అంపైర్‌ ఇచ్చిన రియాక్షన్లు వైరల్‌గా మారాయి.

Virat Kohli LBW
Virat Kohli LBW (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Sep 20, 2024, 7:49 PM IST

Virat Kohli LBW :చెన్నై వేదికగా భారత్ - బంగ్లాదేశ్‌ తొలి టెస్టు రెండో రోజు ఆటలో భారత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రస్తుతం 308 పరుగుల లీడ్​లో కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 81-3 స్కోరు చేసింది. క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌ (33 పరుగులు), రిషబ్‌ పంత్‌ (12 పరుగులు) ఉన్నారు. అయితే భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై కెప్టెన్‌ రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌గా మారింది.

రివ్యూకు కోహ్లీ నో!
రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌(10), రోహిత్‌ శర్మ(5) త్వరగానే పెవిలియన్‌ చేరారు. తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌, కోహ్లి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే విరాట్ 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మెహిదీ హసన్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడబోయాడు. కానీ, అది మిస్ అయ్యి బంతి విరాట్ ప్యాడ్​కు తగలింది. దీన్ని అంపైర్ ఎల్​బీడబ్యూగా ప్రకటించాడు. ఇక విరాట్ కాసేపు గిల్​తో చర్చించి, రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ బాట పట్టాడు.

రీప్లే చూసి షాక్‌
అనంతరం రీప్లేలో షాకింగ్‌ విషయం బయటపడింది. పెద్ద స్క్రీన్‌పై రీప్లేలో బ్యాట్ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌కి బాల్‌ తగిలినట్లు తేలింది. అయితే ఆశ్చర్యకరంగా కోహ్లీ ఈ అంశాన్ని గ్రహించలేకపోయాడు. రివ్యూ తీసుకోకుండానే క్రీజును వీడాడు. ఒకవేళ విరాట్ రివ్యూ తీసుకుంటే బ్యాటింగ్ చేసేవాడు. ఇక బిగ్‌ స్క్రీన్‌పై రీప్లే చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. రివ్యూ కోరాల్సి ఉండొచ్చు కదా అన్నట్లు ఎక్స్​ప్రెషన్ ఇచ్చాడు. మరోవైపు ఫీల్డ్​ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో తన తప్పును చూసి తర్వాత చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విరాట్ ఔటా, నాటౌటా? అని కొంతమంది నెటిజన్లు అంటుంటే, ఇది అంపైర్ తప్పిదమే అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

విరాట్ ఖాతాలో మరో ఘనత - కోహ్లీ కంటే ముందు సచిన్ ఒక్కడే! - Ind vs Ban Test Series 2024

బుమ్రా @ 400 వికెట్లు - అరుదైన ఫీట్ అందుకున్న స్టార్ బౌలర్ - Ind vs Ban Test Series 2024

ABOUT THE AUTHOR

...view details