Virat Kohli Income Tax Payment : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.66 కోట్ల పన్నును తాజాగా చెల్లించాడు. అయితే ఇప్పటివరకూ క్రీడాకారులు కట్టిన ట్యాక్సుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
ఇప్పటివరకూ మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ (రూ.38 కోట్లు), సచిన్ తెందూల్కర్ (రూ.28 కోట్లు), సౌరభ్ గంగూలీ (రూ.23 కోట్లు) హైయ్యెస్ట్ ట్యాక్స్ కట్టగా, ఇప్పుడు వారందరినీ నెట్టి విరాట్ టాప్ పొజిషన్‌కు చేరుకున్నాడు.
ఇదిలా ఉండగా, భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గతంలో రూ.13 కోట్లు పన్నుగా చెల్లించారంటూ ప్రముఖ సంస్థ ఫార్చ్యున్ ఇండియా తాజాగా తమ నివేదికలో పేర్కొంది.
టాప్ 20 జాబితాలో క్రికెటర్లు
సౌరవ్ గంగూలీ- రూ.23 కోట్లు
హార్దిక్ పాండ్యా- రూ.13 కోట్లు
రిషబ్ పంత్ - రూ.10 కోట్లు
ఇక విరాట్ ఆస్తి విలువ ప్రస్తుతానికి సుమారు రూ.1,000 కోట్లు మించి ఉంటుందని అంచనా. అయితే టీమ్ఇండియాలో కీలక బ్యాట్స్మెన్స అలాగే స్టార్ క్రికెటర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న కోహ్లీ ఏటా భారీ మొత్తంలో ఆర్జిస్తున్నాడని ట్రేడ్ వర్గాల మాట.
అయితే టీమ్‌ఇండియా 'A+' కాంట్రాక్ట్ ద్వారా బీసీసీఐ నుంచి విరాట్ కోహ్లీకి రూ.7 కోట్లు లభిస్తాయి. మ్యాచ్ ఫీజులు రూపంలోనూ అతడికి భారీగా ఆదాయం వస్తుంది. మరోవైపు ఐపీఎల్ ద్వారా ఆర్సీబీ జట్టుకు ఆడటం ద్వారా విరాట్ ఏడాదికి రూ.15 కోట్లు పొందుతాడు. విరాట్ ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఒక్కో యాడ్‌లో నటించేందుకు సుమారు రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్లు ఛార్జ్ చేస్తాడని సమాచారం. అంతేకాకూండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా రూ.కోట్లు సంపాదిస్తున్నాడట.
ఇక, కోహ్లీ కెరీర్ విషయానికొస్తే ఆగస్టులో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఆడాడు. ఆ తర్వాత అతడు భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం లండన్‌లో తన ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ గడుపుతున్నాడు. ఇక సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రారంభంకానున్న రెండు టెస్టుల సిరీస్‌తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.
టాప్ 10లో బాబర్ ప్లేస్ ఉఫ్- రోహిత్, విరాట్ ర్యాంక్ ఎంతంటే? - ICC Ranking 2024
విరాట్ UK పౌరసత్వం!- మరి టీమ్ఇండియాకు ఆడగలడా?- రూల్స్ ఎలా ఉన్నాయంటే? - Virat Kohli UK Citizenship