Ashwin Retirement :టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ అశ్విన్ రిటైర్మెంట్పై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. అశ్విన్ నిర్ణయం తనను భావోద్వేగానికి గురిచేసిందని పేర్కొన్నాడు. తనతో ఉన్న అనుబంధాన్ని విరాట్ ఆ సందర్భంహా గుర్తుచేసుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక అంతకుముందు మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో అశ్విన్‌ను విరాట్ భావోద్వేగంతో హాగ్ చేసుకున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
'14ఏళ్లుగా నీతో కలిసి క్రికెట్ ఆడుతున్నా. నువ్వు ఈరోజు రిటైర్మెంట్ గురించి నాతో చెప్పగానే కాస్త ఎమోషనల్ అయ్యాను. నీతో కలిసి ఆడిన రోజులన్నీ ఒక్కసారిగా నా కళ్లముందు తిరిగాయి. నీతో ఆడిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాను. నీ నైపుణ్యాలు అద్భుతం. భారత క్రికెట్‌కు నువ్వు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నువ్వు భారత్ క్రికెట్లో ఓ లెజెండరీ ప్లేయర్. ఇకపై నీ జీవితం కుటుంబంతో కలిసి ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నా. థాంక్స్ మై డియర్ బడ్డీ' అని విరాట్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
'క్రికెట్ కెరీర్‌ను అద్భుతంగా ముగించిన అశ్విన్‌కు అభినందనలు. టెస్ట్ క్రికెటర్‌గా నీ ఆశయాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. దశాబ్దానికి పైగా భారత స్పిన్‌కు మార్గదర్శిగా నిలిచావు. నువ్వు సాధించిన విజయాలపై చాలా గర్వంగా ఉంది. ఇకనుంచి మనం తరచుగా కలుస్తామని ఆశిస్తున్నా' అని మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ అన్నాడు.