తెలంగాణ

telangana

అమెరికాపై అతికష్టంగా విజయం-సూపర్​ 8లోకి రోహిత్​ సేన ఎంట్రీ - T20 World Cup 2024

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 6:46 AM IST

USA VS IND T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్​లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా అమెరికాతో జరిగిన పోరులో టీమ్‌ఇండియా విజయం సాధించింది. అతికష్టంగా ఉన్న పిచ్​పై 7 వికెట్ల తేడాతో రోహిత్ సేన గెలుపొందింది. దీంతో సూపర్​-8లోకి చేరుకుంది.

USA VS IND T20 World Cup 2024
USA VS IND T20 World Cup 2024 (Associated Press)

USA VS IND T20 World Cup 2024 :టీ20 ప్రపంచకప్‌లో భాగంగా యూఎస్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఈ గెలుపుతో రోహిత్​ సేన సూపర్‌-8లో అడుగు పెట్టింది. న్యూయార్క్‌ స్టేడియంలో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ ఎంతో కష్టంగా సాధించింది. సూర్యకుమార్‌ (50*), శివమ్‌ దూబె (31*) ఇద్దరూ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఇక అమెరికా బౌలర్లలో సౌరభ్‌ నేత్రావల్కర్‌ (2/18) అదరగొట్టాడు.

తొలుత బ్యాటింగ్​కు దిగిన యూఎస్​ జట్టు అర్ష్‌దీప్‌ సింగ్‌ (4/9), హార్దిక్‌ పాండ్య (2/14)ల ధాటికి 110 పరుగులకే చేతులెత్తేసింది. ఆ జట్టులోని నితీశ్‌ (27), స్టీవెన్‌ టేలర్‌ (24) తప్ప మిగతా అందరూ పేలవ ఫామ్​తో నిరాశపరిచారు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్​ సేనకు ఆరంభంలోనే చుక్కెదురైంది. రెండో బంతికే విరాట్ కోహ్లి (0) పెవిలియన్ బాట పట్టగా, ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో రోహిత్‌ (3) కూడా ఔటయ్యాడు. 10 పరుగులకే ఓపెనర్లిద్దరూ వెనుదిరగడం వల్ల భారత్‌ కష్టాల్లో పడింది. సరిగ్గా అదే సమయంలో వచ్చిన రిషబ్ పంత్‌ (18) తన ఇన్నింగ్స్​లో యూఎస్ బౌలర్లను కట్టడి చేయాలని చూశాడు. కొద్దిసేపటికే పంత్​ కూడా వెనుతిరిగాడు.

దీంతో క్రీజులో నిలదొక్కుకోవడానికి సూర్యకుమార్ యాదవ్ తంటాలు పడ్డాడు. పంత్ తర్వాత వచ్చిన శివమ్‌ దూబె కూడా కష్టంగానే ఆడాడు. బంతి బ్యాట్‌ మీదికి రాకపోవడం వల్ల తన శైలిలో షాట్లు ఆడడానికి ఇబ్బంది పడ్డాడు. సూర్య షాట్లు కూడా చాలానే గురి తప్పాయి. 13 ఓవర్లకు భారత్‌ 60/3తో నిలవగా, అప్పుడున్న పరిస్థితుల్లో 7 ఓవర్లలో 51 పరుగులు చేయడం సాధ్యం కాదనిపించింది. అయితే సూర్య, దూబె సరైన సమయంలో బ్యాట్లను ఝళిపించడం వల్ల క్రమ క్రమంగా లక్ష్యం కరుగుతూ వచ్చింది. అండర్సన్‌ బౌలింగ్‌లో దూబె సిక్సర్‌ బాదితే, శాండ్లీ బౌలింగ్‌లో సూర్య వరుసగా 6, 4 ఇలా బాల్​ను బౌండరీ దాటించాడు. దీంతో చివరి 3 ఓవర్లలో 14 పరుగులతో సమీకరణం తేలికైపోయింది. తర్వాత మ్యాచ్‌ ముగియడానికి ఎంతో సమయం కూడా పట్టలేదు.

హోరాహోరీగా టీ20 వరల్డ్‌ కప్ - బ్యాట్‌ను ఓడిస్తున్న బాల్‌! - T20 World Cup 2024

ఆస్పత్రి బెడ్​పై టీమిండియా స్టార్ క్రికెటర్! - అసలేం జరిగిందంటే?

ABOUT THE AUTHOR

...view details