Under 19 World Cup Teamindia Performance : అండర్ - 19 వరల్డ్ కప్‌లో యువ భారత్ అద్భుత ప్రదర్శనతో సాగినప్పటికీ మంచి ముగింపు దక్కలేదు. ఫైనల్లో బోల్తా పడి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ మెగాటోర్నీలో కొంతమంది మనోళ్ల కుర్రాళ్ల ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. భారత క్రికెట్ భవిష్యత్ మెరుగ్గానే ఉందని ఈ ప్లేయర్ల ప్రదర్శన చెబుతోంది. ఈ నేపథ్యంలో అండర్-19 నుంచి సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేలా ఉన్న ప్లేయర్స్ ఎవరో ఓ లుక్కేద్దాం.
ఉదయ్ సహారన్ : అండర్-19 ప్రపంచ కప్‌లో కెప్టెన్‌గా జట్టును అజేయంగా ఫైనల్ చేర్చాడు ఈ కుర్రాడు. క్రికెట్ కోసం రాజస్థాన్‌లోని గంగానగర్ నుంచి పంజాబ్‌కు మకాం మర్చాడు. ప్రస్తుతం జరిగిన టోర్నీలో బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీతోనూ అదరగొట్టాడు. జూనియర్ మిస్టర్ కూల్‌గా పేరు గడించాడు. సెమీస్‌లో అతడు చేసిన 81 పరుగుల ఇన్నింగ్స్ జట్టును కాపాడింది. ఈ టోర్నీలో అత్యధిక పరుగుల చేసింది ఇతనే. 7 ఇన్నింగ్స్‌ల్లో 56.71 యావరేజ్‌తో 397 పరుగులు చేశారు. ఇందులో ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ముషీర్ ఖాన్ : దేశవాళీల్లో భారీగా పరుగులు చేసి టీమ్‌ఇండియా తరఫున ఆడేందుకు అడుగు దూరంలో ఉన్నాడు సర్ఫరాజ్. అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం జరిగిన వరల్డ్ కప్‌లో 7 ఇన్నింగ్స్‌ల్లో 60 యావరేజ్‌తో 360 పరుగులు చేశాడు ఈ ముంబయి కుర్రాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ రెండు సెంచరీలను ఖాతాలో వేసుకున్నాడు. ఇతను స్పిన్నర్ కూడా. ఈ వరల్డ్ కప్‌లో అతడు లెఫ్టార్మ్ ఆఫ్‌స్పిన్‌తో 7 వికెట్లను తీశాడు.
సచిన్ : క్రికెటర్ కావాలని ఆశించిన మహారాష్ట్రకు చెందిన సంజయ్ కబడ్డీలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించాడు. కానీ క్రికెట్‌పై ఉన్న మక్కువతో అకాడమీ పెట్టాడు. కొడుకుకు సచిన్ పేరు పెట్టాడు. ఇప్పుడా తండ్రి కలను నిజం చేస్తూ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు సచిన్. ఈ వరల్డ్ కప్‌లో అటాకింగ్ ఆటతో, ఫినిషింగ్ నైపుణ్యాలతో మంచిగా రాణించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో లక్ష్య ఛేధనలో 32కే నాలుగు వికెట్లు పడ్డాయి. ఆ దశలో 96 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. 7 ఇన్నింగ్స్‌ల్లో 60.60 యావరేజ్‌తో 303 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో ఐదో స్థానం నిలిచాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.