Under 19 World Cup 2024 Australia : ఫిబ్రవరి 11 భారత కుర్రాళ్ల కల చెదిరిన సంగతి తెలిసిందే. అండర్ - 19 వరల్డ్ కప్ చేజారింది. ఆదివారం జరిగిన తుదిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్‌ఇండియాను 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు ఓడించింది. అయితే ఆస్ట్రేలియా ఇప్పుడేమి తొలిసారి ఆధిపత్యం చెలాయించలేదు. ప్రపంచ క్రికెట్‌పై కంగారుల జట్టు ఎప్పటినుంచో ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది. ఫార్మాట్లకు అతీతంగా వరుస టైటిల్స్‌ను ఖాతాలో వేసుకుంటూ ప్రపంచ క్రికెట్‌ను శాశిస్తోంది. ఈ మధ్య కాలంలో జరిగిన అన్ని మెగా ఈవెంట్ల ఫైనల్స్‌లోనూ ఆసీస్ విజయాలు సాధిస్తూ దూసుకెళ్లింది.
ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియా క్రికెట్ హవా కేవలం పురుషుల క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. మహిళ క్రికెట్‌లోనూ డామినేషన్ చేస్తూనే ఉంది. అలా ఇప్పుడు ఆస్ట్రేలియన్లు జూనియర్ విభాగంలోనూ అదరగొట్టారు. అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్లో యువ ఆసీస్ జట్టు యంగ్ ఇండియాను చిత్తుగా ఓడించింది. ఈ అండర్ - 19లో నాలుగోసారి జగజ్జేతగా అవతరించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అలా ఈ అండర్ 19 టైటిల్‌తో ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లోనూ పురుషులు, మహిళలు, జూనియర్ లెవెల్లో వరల్డ్ ఛాంపియన్‌గా(వన్డే ఫార్మాట్‌లో) అవతరించింది.
- వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్ - ఆస్ట్రేలియా
- అండర్ 19 వరల్డ్‌కప్ ఛాంపియన్ - ఆస్ట్రేలియా
- మహిళల వన్డే వరల్డ్‌కప్ ఛాంపియన్ - ఆస్ట్రేలియా
- మహిళల టీ20 ఛాంపియన్ - ఆస్ట్రేలియా
- వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ - ఆస్ట్రేలియా