Neeraj Chopra Top Records : భారతదేశానికి లభించిన గొప్ప అథ్లెట్స్‌లో నీరజ్ చోప్రా ఒకడు. వరుసగా రెండు సమ్మర్ ఒలింపిక్ క్రీడల్లో పతకాలు గెలిచిన మొదటి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నిలిచాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకంతో ఇండియా గోల్డెన్ బాయ్‌గా పేరు సంపాదించుకున్నాడు. అనంతరం 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం ముద్దాడలేకపోయినా, సిల్వర్ మెడల్‌తో సత్తా చాటాడు.
ఒలింపిక్స్ సహా ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, కామన్వెల్త్ గేమ్స్, డైమండ్ లీగ్ వంటి ప్రధాన ఈవెంట్‌లలో నీరజ్ అద్భుతంగా రాణించాడు. ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకొన్నాడు. ఈ రికార్డులను మరో భారత అథ్లెట్ అందుకోవడం చాలా కష్టమనే చెప్పాలి.
Neeraj Chopra Diamond League Final :ఇకపోతే తాజాగా ఇప్పుడతడు ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత పొందాడు. 14 సిరీస్‌ల డైమండ్ లీగ్‌లో నాలుగో స్థానంలో నిలవడం ద్వారా నీరజ్ ఫైనల్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. దోహా, లుసానె డైమండ్ లీగ్ టోర్నీల్లో రెండో స్థానంలో నిలవడం ద్వారా నీరజ్ 14 పాయింట్లు సాధించాడు. అయితే ఇప్పుడు నీరజ్ చోప్రా సాధించిన టాప్ రికార్డుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జాతీయ స్థాయిలో అత్యుత్తమ రికార్డు - మెన్స్ జావెలిన్‌లో నీరజ్ వ్యక్తిగత బెస్ట్ త్రో 89.94 మీటర్లు. దీంతో అతడు ఇండియన్ నేషనల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫ్యూచర్ ఇండియన్ అథ్లెట్లు ఈ లక్ష్యాన్ని అందుకోవడం కష్టం.
మొదటి ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ వరల్డ్ ఛాంపియన్ - 2016లో నీరజ్ IAAF వరల్డ్ U20 ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు నీరజ్. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో దీన్ని సాధించిన మొదటి ఇండియన్ అథ్లెట్‌గా నీరజే.