Telugu Cricketers WPL:2024 డబ్ల్యూపీఎల్‌కు రంగం సిద్ధమైంది. ఈరోజు (ఫిబ్రవరి 23) రెండో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ముంబయి ఇండియన్స్- దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో టోర్నీకి తెరలెవనుంది. అయితే ఈ టోర్నీలో సత్తా చాటేందుకు మన తెలుగమ్మాయిలూ సిద్ధమయ్యారు. మరి వారెవరో చూసేద్దాం.
అంజలి శర్వాణి: యువపేసర్ అంజలి శర్వాణిపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియా జట్టుపై అంజలి శర్వాణి క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు ఆమె ఆరు మ్యాచ్‌లు ఆడగా మూడు వికెట్లు పడగొట్టి ఫర్వాలేదనిపించింది. తక్కువ వికెట్లే తీసినా, పొదుపుగా, మంచి స్పీడ్‌తో బౌలింగ్ చేయడం అంజలి స్పెషాలిటీ. ఈమె ఈ టోర్నీలో యూపీ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈమెను యూపీ రూ. 55లక్షలకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన తెలుగు ప్లేయర్ అంజలీయే.
అరుంధతిరెడ్డి: అరుంధతి రెడ్డి ఇప్పటికే టీమ్ఇండియాకు 26 మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించింది. డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతోంది. ఈమెను దిల్లీ రూ.30లక్షలకు దక్కించుకుంది.
సబ్బినేని మేఘన:సబ్బినేని మేఘన బ్యాట్‌తో అదరగొడుతుంది. ఇప్పటివరకు 3 వన్డేలు, 17 టి20ల్లో టీమ్ఇండియాకి ప్రాతినిధ్యం వహించింది. ఈమెను గుజరాత్ జెయింట్స్ ఫ్రాంఛైజీ రూ.30లక్షలకు కొనుగోలు చేసింది.
గౌహర్ సుల్తానా:గౌహర్ సుల్తానా టీమ్ఇండియాకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తెలుగు అమ్మాయిల్లో ఒకరు. సుల్తానా స్వస్థలం హైదరాబాద్. సల్తానా ఇప్పటివరకు 50 వన్డేలు, 37 టీ20ల్లో ఆడింది. 35ఏళ్ల వయసులో ప్రస్తుత డబ్ల్యూపీఎల్‌లో యూపీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది.