తెలంగాణ

telangana

ETV Bharat / sports

తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్‌ - సోషల్ మీడియాలో పోస్ట్​ - KL RAHUL ATHIYA SHETTY PREGNANCY

తల్లిదండ్రులు కాబోతున్న కేఎల్ రాహుల్‌, అతియా శెట్టి.

Kl Rahul Athiya Shetty Announce Pregnancy
Kl Rahul Athiya Shetty Announce Pregnancy (source rahul wedding screen shot)

By ETV Bharat Sports Team

Published : Nov 8, 2024, 7:25 PM IST

Kl Rahul Athiya Shetty Announce Pregnancy :మరో సెలబ్రిటీ కపుల్‌ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. టీమ్‌ ఇండియా స్టార్‌ ప్లేయర్‌ కేఎల్ రాహుల్, అతియా శెట్టి తల్లిదండ్రులుగా మారబోతున్నారు. ఈ జంట సోషల్‌ మీడియా వేదికగా ఈ శుభవార్తను షేర్‌ చేసుకున్నారు. త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ట్లు ప్రకటించారు. "అవర్‌ బ్యూటిఫుల్‌ బ్లెస్సింగ్‌ ఈజ్‌ కమింగ్‌ సూన్‌ ఇన్​ 2025." అని రాసుకొచ్చారు.

కంగ్రాట్స్​ తెలిపిన సెలబ్రిటీలు - అయితే అతియా, రాహుల్‌ పంచుకున్న గుడ్​ న్యూస్​పై చాలా మంది ఫ్యాన్స్​, ఇతర సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేశారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు కంగ్రాట్స్‌ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఓ మై గాడ్​ సో హ్యాపీ అంటూ హార్ట్​, లవ్​ సింబల్స్​ను పోస్ట్​ చేయగా, బాలీవుడ్‌ హీరో అర్జున్ కపూర్ స్పందిస్తూ, 'డంప్లింగ్ కమింగ్ త్రూ' అంటూ హార్ట్ ఎమోజీలను షేర్ చేశాడు. షిబానీ అక్తర్, 'కంగ్రాచ్యులేషన్స్‌ మై డార్లింగ్. సో హ్యాపీ ఫర్‌ యూ బోత్‌' అని చెప్పాడు. అతియా సోదరుడు అహన్ శెట్టి, 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' ఫేమ్ కృష్ణ ష్రాఫ్‌ సహా ఇంకా చాలా మంది ఎమోజీలు, కామెంట్లతో ఆనందం వ్యక్తం చేశారు.

  • 2023లో రాహుల్‌, అతియా పెళ్లి
    రాహుల్, అతియా శెట్టికి 2023 జనవరిలో వివాహం జరిగింది. ఖండాలాలోని అతియా తండ్రి బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి ఫామ్ హౌస్‌లో వివాహం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
  • ఇంతకు ముందే హింట్‌ ఇచ్చిన సునీల్‌ శెట్టి!
    అతియా గర్భం దాల్చినట్లు గతంలోనే సునీల్‌ శెట్టి హింట్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని బాలీవుడ్‌ స్టార్స్‌ మాధురీ దీక్షిత్‌, సునీల్ శెట్టి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న డ్యాన్స్ దీవానే సెట్స్‌లో బయట పెట్టారు సునీల్ శెట్టి. షోలో తాతయ్యల స్పెషల్ ఎపిసోడ్‌ రాగా, అందులో సునీల్ శెట్టి స్పందిస్తూ, 'నేను వచ్చే సీజన్‌లో తాతలాగా వేదికపై నడుస్తాను' అని చెప్పాడు. అప్పుడు సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్​గా మారింది.

ఇకపోతే ప్రస్తుతం రాహుల్ బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. భారత్‌-ఎ, ఆస్ట్రేలియా-ఎ మధ్య జరుగుతున్న రెండో అనధికార టెస్టులో ఆడుతున్నాడు.

'ఔట్ అవ్వడంలో ఇదో కొత్తరకం!' - మళ్లీ నిరాశపరిచిన కేఎల్ రాహుల్​!

మొసళ్ల నదిలో పడిపోయిన మాజీ క్రికెటర్ - ఇప్పుడు అతడి పరిస్థితి ఎలా ఉందంటే?

ABOUT THE AUTHOR

...view details