Team India Womens Asia Cup 2024:మహిళల ఆసియా కప్ 2024 టోర్నీకి బీసీసీఐ టీమ్ఇండియా జట్టను ప్రకటించింది. 15మందితో కూడిన స్క్వాడ్‌ను శనివారం బీసీసీఐ వెల్లడించింది. మరో నలుగురు ప్లేయర్లను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేసింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. కాగా, ఈ టోర్నమెంట్ జూలై 19న ప్రారంభమై 28న ముగుస్తుంది. ఈ ఎడిషన్‌కు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది.
గత సీజన్‌లాగే ఈసారి కూడా టీ20 ఫార్మాట్లోనే టోర్నమెంట్ జరగనుంది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా మొత్తం 8జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. టోర్నీలో పాల్గొనే దేశాలు తమతమ జట్లను ఇప్పటికే ప్రకటించాయి. మొత్తం గ్రూప్ దశలో 12మ్యాచ్‌లు ఉండనున్నాయి. జూలై 26న సెమీఫైనల్ 1, సెమీఫైనల్ 2 మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు గ్రూప్‌ల్లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో నెగ్గిన జట్లు 28న జరిగే ఫైనల్‌కు దూసుకెళ్తాయి.
భారత్- పాకిస్ధాన్ మ్యాచ్: ఈ టోర్నీలో తొలిరోజే హై వోల్టేజ్ గేమ్ భారత్- పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్‌కు దంబుల్లా మైదానం వేదిక కానుంది. జూలై 19 రాత్రి 7.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గతంలో టీమ్ఇండియా 6సార్లు పాకిస్థాన్‌తో తలపడగా అన్నింట్లోనూ విజయం సాధించింది. ఇక ఓవరాల్‌గా ఈ ఇరుజట్లు 14టీ20 మ్యాచ్‌ల్లో పోటీపడగా భారత్ 11సార్లు, పాకిస్థాన్ 3 మ్యాచ్‌ల్లో నెగ్గింది.
భారత్ మ్యాచ్‌లు
జులై 19 | భారత్- పాకిస్థాన్ |
జులై 21 | భారత్- యూఏఈ |
జులై 23 | భారత్- నేపాల్ |