India vs Bangladesh Test Series 2024 :బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. తొలి టెస్టులో విజయం సాధించిన జట్టుతోనే రెండో టెస్టుకు కూడా సిద్ధం అవుతోంది. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని తొలుత భావించినా, అలాంటిదేమీ జరగలేదు. కాన్పూర్ వేదికదా సెప్టెంబర్ 27న రెండో టెస్టు ప్రారంభం కానుంది. మరోవైపు బంగ్లాదేశ్ ఈ సిరీస్ కోసం రెండు టెస్టులకు ఒకే జట్టును ముందే ప్రకటించింది.
కాగా, బంగ్లాదేశ్ సిరీస్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తొలి టెస్టులో నాలుగు రోజుల్లోనే విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ శతకాలు బాదారు. మరోవైపు బంతితోనూ అద్భుతాలు చేసిన టీమ్ఇండియా బౌలర్లు బంగ్లా బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో బంగ్లా ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఇక బౌలింగ్‌లోనూ సత్తా చాటిన అశ్విన్‌కు 'మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
స్కోర్లు
- భారత్ : 376 & 287/4 d
- బంగ్లాదేశ్ : 149 & 234