Gautam Gambhir Support Staff:టీమ్ఇండియా కొత్త హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్ ఎంపికపై గత కొన్నిరోజులుగా ఆసక్తి నెలకొంది. జట్టుకు కొత్త బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లు ఎంపికకానున్నారని ప్రచారం కూడా సాగింది. ఈ క్రమంలో గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్ కోసం ఆరుగురి పేర్లను ప్రతిపాదిస్తే, బీసీసీఐ దాన్ని తిరస్కరించిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్ ఎంపిక పూర్తైనట్లు తెలుస్తోంది.
టీమ్ఇండియా మాజీ ప్లేయర్ అభిషేక్ నాయర్, హెడ్‌కోచ్ గంభీర్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైనట్లు సమాచారం. అలాగే నెదర్లాండ్స్ మాజీ ఆటగాడు టెన్ డెష్కటే కూడా గంభీర్ స్టాఫ్‌లో చోటు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో అభిషేక్ నాయర్ సోమవారం (జులై 22న) టీమ్ఇండియా జట్టుతో కొలంబో వెళ్లనున్నాడు. మరోవైపు టెన్ డెష్కటే డైరెక్ట్‌గా కొలంబో వెళ్లి భారత్ జట్టుతో చేరనున్నాడని బోర్డు మెంబర్ ఒకరు తెలిపారు. దీంతో ఈ ఇద్దరూ సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్లుగా ఖరారైనట్లేనని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. కాగా, సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ టీమ్ఇండియా కొత్త బౌలింగ్ కోచ్‌గా ఎంపికవడం కూడా దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇక ఫీల్డింగ్ కోచ్‌గా టీ దిలీప్ అలాగే కొనసాగనున్నాడు.
గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్ అండ్ టీమ్!
- అసిస్టెంట్ కోచ్‌లు: అభిషేక్ నాయర్, టెన్ డెష్కటే
- బౌలింగ్ కోచ్: మోర్నీ మోర్కెల్
- ఫీల్డింగ్ కోచ్: టీ. దిలీప్
- వన్డే, టెస్టు కెప్టెన్: రోహిత్ శర్మ
- టీ20 కెప్టెన్: సూర్యకుమార్ యాదవ్
మీడియా ముందుకు అప్పుడే
గంభీర్ జట్టు కోచ్‌గా ఎంపికైన తర్వాత మీడియా ముందుకు రాలేదు. అయితే శ్రీలంక పర్యటనకు సోమవారం టీమ్ఇండియా కొలంబో బయల్దేరనుంది. ఆ రోజే గంభీర్ మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కూడా అదే రోజు గంభీర్‌కు అఫీషియల్‌గా కోచ్ బాధ్యతలు అప్పజెప్పనుంది. కాగా, శ్రీలంక పర్యటన జులై 27న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భారత్ 3టీ20, 3వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.