Rohit Sharma Border Gavaskar Trophy :టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. వ్యక్తిగత కారణాలతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమైయ్యాడు. నవంబర్ 24వ తారీఖు రోహిత్ ఆస్ట్రేలియా చేరుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. హిట్‌మ్యాన్ నేరుగా తొలి టెస్టు మ్యాచ్ వేదిక పెర్త్‌కు చేరుకోనున్నాడు. కాగా, నవంబర్ 22న భారత్- ఆసీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. అంటే ఈ మ్యాచ్ జరుగుతుండగానే రోహిత్ పెర్త్ స్టేడియంలో కనిపించనున్నాడు.
'నవంబర్ 23న రోహిత్ ముంబయి నుంచి బయలుదేరాల్సి ఉంది. అతడు 24వ తేదీన పెర్త్ చేరుకుంటాడు. తర్వాత అడిలైడ్‌లో జరిగే డే- నైట్ (రెండో మ్యాచ్) టెస్టుకు ఎలా ప్రిపేర్ అవ్వాలనే దానిపై కోచింగ్ స్టాఫ్‌తో చర్చిస్తాడు. ఇక కాన్బెర్రాలో జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడు' అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 6న ప్రారంభం కానుంది.
కాగా, ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత ఆటగాళ్లు ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లారు. అయితే తన భార్య ప్రవసం కారణంగా కెప్టెన్ రోహిత్ జట్టుతో కలిసి ఆసీస్‌కు వెళ్లలేదు. దీంతో తొలి టెస్టుకు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు మేనేజ్మెంట్ నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఇక తాజాగా ఆసీస్ పయనమయ్యేందుకు రోహిత్ రెడీ అవ్వడం వల్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.