T20 WorldCup 2024 :టీ20 ప్రపంచ కప్‌నకు సర్వం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్‌లోని ఎవరి ఆటనైతే చూసి సంబరపడ్డామో ఇప్పుడు వాళ్లే ప్రత్యేర్థులగా వచ్చి భయపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ వారెవరో చూద్దాం.
విండీస్ - వెస్టిండీస్‌కు అసలే సొంత మైదానం. పైగా ఈ సీజన్ ఐపీఎల్ ద్వారా హార్డ్ హిట్టర్లంతా ఫామ్‌లో ఉన్నారు. ట్రోఫీని ముద్దాడిన కేకేఆర్ జట్టులో ఆండ్రూ రస్సెల్‌తో పాటు లఖ్‌నవూ ప్లేయర్ నికోలస్ పూరన్, షై హోప్, రొమారియో షెఫర్డ్, రోవ్‌మన్ పావెల్, షిమ్రోన్ హెట్‌మయెర్ అందరూ జోరు మీదున్నారు. పిచ్ పరిస్థితులు వారికి కొట్టిన పిండి. ఇప్పుడు వీరిని ఆపడం కష్టమని క్రికెట్ వర్గాల అభిప్రాయం.
ఇంగ్లాండ్ - డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్‌కు ఈ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ కలిసొస్తుంది. రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు చేరడంలో బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీలో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన విల్ జాక్స్, పంజాబ్ సామ్ కరన్, ఆ జట్టులో ఓపెనర్‌గా దూకుడుగా ప్రదర్శించిన జానీ బెయిర్‌స్టో ప్రపంచ కప్ టీమ్‌లో ఉన్నారు. ఫిల్ సాల్ట్ కోల్‌కతాను అగ్రస్థానంతో ఛాంపియన్‌గా నిలవడంలో సునీల్ నరైన్‌తో కలిసి కీలకంగా వ్యవహరించాడు. అయితే మొయిన్ అలీ, లివింగ్ స్టోన్ మాత్రం పెద్దగా రాణించలేదు.