తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళల టీ20 వరల్డ్​కప్ షెడ్యూల్ రిలీజ్- 'ఇండో-పాక్' మ్యాచ్ ఎప్పుడంటే? - T20 World Cup 2024 Women - T20 WORLD CUP 2024 WOMEN

T20 World Cup 2024 Women: 2024 మహిళల టీ20 వరల్డ్​కప్ షెడ్యూల్ ఆదివారం రిలీజైంది. 2024 అక్టోబర్ 03 నుంచి 20 దాకా టోర్నీ జరగనుంది.

T20 World Cup 2024 Women
T20 World Cup 2024 Women (Source: ANI)

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 3:18 PM IST

Updated : May 5, 2024, 3:41 PM IST

T20 World Cup 2024 Women:2024 మహిళల టీ20 వరల్డ్​కప్ షెడ్యూల్ ఆదివారం రీలీజైంది. ఈ టోర్నీ లాంఛ్ ఈవెంట్​కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీన చీఫ్ గెస్ట్​గా హాజరై మ్యాచ్​ల షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఆమెతోపాటు బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ నిగర్ సుల్తానా, టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్ ఈ ఈవెంట్​లో పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్​కు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. ఢాకా, సిల్​హెట్ స్టేడియాల్లో ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

అక్టోబర్ 03 నుంచి 20 వరకు ఈ టోర్నీ జరగనుంది. 17, 18 తారీఖుల్లో సెమీస్, 20న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్​లకు రిజర్వ్ డే ఉన్నట్లు ఐసీసీ తెలిపింది. ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొనున్నాయి. అస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్​ జట్లు నేరుగా టోర్నీకి అర్హత సాధించగా, మరో రెండు స్థానాల కోసం క్వాలిఫయర్ మ్యాచ్​లు జరగనున్నాయి.

ఈ 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో జట్టు తమ గ్రూపులోని మిగిలిన నాలుగు టీమ్స్​తో ఒక్కోమ్యాచ్​ ఆడతాయి. ఆక్టోబర్ 3న ఇంగ్లాండ్- సౌతాఫ్రికా మ్యాచ్​తో టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 6న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​కు సిల్​హెట్ మైదానం ఆతిథ్యమివ్వనుంది. ఇక 19 రోజులపాటు సాగే టోర్నీలో మొత్తం 23 మ్యాచ్​లు జరగనున్నాయి. లీగ్​ స్టేజ్ మ్యాచ్​ల అనంతరం రెండు గ్రూప్​ల్లో టాప్-2లో ఉన్న జట్లు సెమీస్​కు అర్హత సాధిస్తాయి.

  • గ్రూప్ A (ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, క్వాలిఫయర్ 1)
  • గ్రూప్ B (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్ 2)

మధ్యాహ్నం మ్యాచ్ 3.00 PM, సాయంత్రం మ్యాచ్​లు 7.00PM గంటలకు ప్రారంభమౌతాయి.

హాట్ ఫేవరెట్​గా భారత్:టీమ్ఇండియా మరోసారి టైటిల్ ఫేవరెట్​గా బరిలోకి దిగనుంది. 2020లో ఫైనల్​దాకా వెళ్లిన టీమ్ఇండియా ఆస్ట్రేలియా చేతిలో భంగపడింది. ఇక గతేడాది జరిగిన టోర్నీలో సెమీస్​లోనే టీమ్ఇండియా ఇంటిబాట పట్టింది. దీంతో ఇప్పటివరకు పొట్టికప్ ఛాంపియన్​గా నిలవని భారత్ ఈసారి టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.

ఆసీస్​దే పైచేయి:ఇక ఇప్పటివరకు 8సార్లు వరల్డ్​కప్ జరగ్గా ఆస్ట్రేలియా అత్యధికంగా 6సార్లు ఛాంపియన్​ (2010, 2012, 2014, 2018, 2020, 2023)గా నిలిచింది. 2016లోనూ ఫైనల్ చేరిన ఆసీస్​ తుదిపోరులో వెస్టిండీస్​ చేతిలో ఓడింది. ఇక 2009లో ఇంగ్లాండ్, 2016లో విండీస్ టైటిల్ సాధించాయి.

ఫైనల్లో టీమ్​ఇండియా ఓటమి.. సిల్వర్​ సాధించిన మహిళల జట్టు

ఆసీస్​ కెప్టెన్​ చేసిన పనికి భారత జట్టు​ ఫైర్​ - హర్మన్​కు అంత కోపం వచ్చిందా!

Last Updated : May 5, 2024, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details