తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ, పంత్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ - టీ20 ప్రపంచకప్‌ జట్టు ఇదే! - T20 World Cup 2024

T20 World Cup 2024 India Squad : మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌‌ నేపథ్యంలో భారత జట్టును సెలక్టర్లు దాదాపు ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు స్టోరీలో

T20 World Cup 2024
పంత్​కు గుడ్​న్యూస్​ - టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా జట్టు ఇదే!

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 5:49 PM IST

Updated : Apr 9, 2024, 6:49 PM IST

T20 World Cup 2024 India Squad :ఐపీఎల్‌ 2024 హోరా హోరీగా సాగుతోంది. టైటిల్‌ కోసం అన్ని టీమ్‌లు చెమటోడుస్తున్నాయి. మరోవైపు మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్‌‌ కూడా ప్రారంభం కానుంది. దీంతో ఐసీసీ నిర్వహించనున్న ఈ మెగాటోర్నీలో ఎవరు చోటు దక్కించుకుంటారు? అనే చర్చలు కూడా నడుస్తున్నాయి. అయితే టీమ్‌ సెలక్షన్‌కు ఐపీఎల్ పర్‌పార్మెన్స్‌ కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పటికే ఐపీఎల్ 17వ సీజన్‌లో 22 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కొందరు ఆటగాళ్లు స్థిరంగా రాణిస్తూ, రికార్డులు క్రియేట్‌ చేస్తున్నారు. ఈ పర్ఫార్మెన్స్‌ల ఆధారంగా క్రికెట్‌ ఎక్స్‌పెర్ట్స్‌, మాజీ ఆటగాళ్లు టీమ్‌ సెలక్షన్‌ అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో భారత జట్టును సెలక్టర్లు దాదాపు ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఐపీఎల్ ప్రారంభమై దాదాపు 20 రోజులు గడిచిన నేపథ్యంలో జట్టు కూర్పు గురించి టీమ్ఇండియా సెలక్టర్లు ఓ అభిప్రాయానికి వచ్చారని ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు పంత్, కోహ్లీకి జట్టులో చోటు కల్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే రీసెంట్​గా అదరగొట్టిన ఐపీఎల్ 2024 ఫాస్టెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ పేరును కూడా పరిశీలిస్తున్నారట.

  • పంత్​కు ఎక్కువ అవకాశాలు

ఐపీఎల్ 2024లో వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్ టీ20 టీమ్‌లో వికెట్ కీపర్ స్లాట్ కోసం పోటీలో ముందున్నాడు. దాదాపు 15 నెలల పాటు క్రికెట్‌కు దూరమైన రిషబ్‌, నేషనల్‌ టీమ్‌లో అడుగుపెట్టేందుకు ఎదురు చూస్తున్నాడు. దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు అటు కీపింగ్‌, ఇటు బ్యాటింగ్‌లో ఆకర్షిస్తున్నాడు. DC తరఫున వరుసగా 18, 28, 51, 55, 1 పరుగులు చేశాడు. దీంతో కీపర్‌-బ్యాటర్‌ పొజిషన్‌కు పోటీపడుతున్న ఇతరుల కన్నా పంత్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంత్‌కు సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ నుంచి పోటీ ఉంటుంది.

  • కోహ్లీకి పక్కా ఛాన్స్
    ఈ వరల్డ్ కప్​ జట్టులో మొదట కోహ్లీ పేరు ఉండకపోవచ్చనే ప్రచారం కూడా సాగింది. అయితే ఇప్పుడు టీ20 భారత్‌ జట్టులో అతడు కచ్చితంగా ఉంటాడని తెలిసింది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్‌ విరాట్ కోహ్లి సెంచరీ (113*) కొట్టిన సంగతి తెలిసిందే. మొత్తంగా కోహ్లీ ఐపీఎల్‌లో ఎనిమిదో సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్‌ 2024లో ఇప్పటి వరకు ఆర్సీబీ ఆడిన ఐదు మ్యాచ్‌లలో కోహ్లీ అద్భుతంగా ఆడాడు. 5 మ్యాచ్‌లలో 316 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.
  • టీ20 టీమ్‌ ఎప్పుడు సెలక్ట్‌ చేస్తారు?
    రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌తో పోటీ పడుతున్న శుభ్‌మన్ గిల్‌పై సెలెక్టర్లు ఓ అంచనాకు రాలేదని తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున అనూహ్యంగా పోటీలోకి వచ్చిన చాహల్ విషయంలోనూ అదే జరిగింది. స్పిన్నర్ స్లాట్ కోసం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ పోటీలో ఉన్నారు. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఫాస్ట్ బౌలర్లుగా చోటు దక్కించకునే అవకాశాలు ఉన్నాయి.

మయాంక్ యాదవ్‌పై నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ నయా స్పీడ్‌స్టర్ మూడు మ్యాచ్‌లలో 6 వికెట్లు పడగొట్టాడు. 150+ వేగంతో ఆకట్టుకుంటున్నాడు. అయితే సెలక్టర్లు అతని పనితీరును ఇంకా దగ్గరగా పరిశీలించే అవకాశం ఉంది. మే మొదటి వారంలో జట్టు ఎంపిక జరిగే అవకాశం ఉంది.

భారత జట్టు (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్య, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రింకు సింగ్, కుల్‌దీప్‌ యాదవ్/చాహల్, షమీ, సిరాజ్/ మయాంక్‌ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా.

శ్రేయస్ క్రష్ ఆ అమ్మాయే - సీక్రెల్ రివీల్ చేసిన కేకేఆర్ కెప్టెన్ - Shreyas Iyer Crush

'అప్పుడేమో వెన్నుపోటు పొడిచి​ ఇప్పుడు ప్రశంసిస్తున్నావా'​ - IPL 2024 RCB Dinesh Karthik

Last Updated : Apr 9, 2024, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details