తెలంగాణ

telangana

ETV Bharat / sports

సూర్య కుమార్​కు ఊహించని ఎదురుదెబ్బ​ - ఒకటి అనుకుంటే ఇంకేదో జరిగింది! - Suryakumari Yadav Test Cricket - SURYAKUMARI YADAV TEST CRICKET

టీమ్​ ఇండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్​కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source Associated Press
Suryakumar Injured (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Aug 31, 2024, 1:07 PM IST

Suryakumar Injured : టీమ్​ ఇండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్​కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టెస్టుల్లో పునరాగమనమే లక్ష్యంగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ బరిలోకి దిగిన అతడికి గాయం అయింది. అతడి చేతి వేలికి దెబ్బ తగిలింది. దీంతో మిస్టర్​ 360 సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న దులిప్‌ ట్రోఫీకి దూరమయ్యే అవకాశం ఉంది. బంగ్లాదేశ్​తో టెస్టు సిరీస్‌ సమయానికి కూడా అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని సమాచారం.

టీమ్​ ఇండియా టెస్టు టీమ్​లో స్థానం సంపాదిచడమే తన లక్ష్యమని ఈ మధ్యే చెప్పుకొచ్చాడు టీ20 స్పెషలిస్ట్ సూర్య కుమార్ యాదవ్. కానీ ఇప్పుడీ గాయం వల్ల బంగ్లాదేశ్​తో జరగబోయే సిరీస్​కు అతడు ఎంపిక కావడం కష్టంగానే కనిపిస్తుంది. పైగా ప్రస్తుతం భారత టెస్టు జట్టులో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ సమయంలో సూర్యకు గాయం అవ్వడం ప్రతికూలమనే చెప్పాలి. ప్రస్తుతం మిస్టర్ 360 భారత టీ20 జట్టుకు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. అతడి వన్డే, టెస్టుల్లో చోటు దక్కడం లేదు.

Suryakumar Test Career :కాగా, 2023 ఫిబ్రవరిలో బోర్డర్‌ - గావస్కర్ ట్రోఫీతో సూర్య కుమార్‌ యాదవ్‌ టీమ్​ ఇండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సొంత గడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో సూర్య కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత అతడికి మళ్లీ టెస్టు టీమ్​లో చోటు దక్కలేదు. దీంతో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలని అతడు భావించాడు.

అయితే దులిప్‌ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా ఈ బంగ్లాదేశ్​ సిరీస్​కు కొంతమంది ప్లేయర్లను​ బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు! కానీ ఇప్పుడు సూర్య గాయం అవ్వడం వల్ల అతడి టెస్ట్​ కెరీర్​పై సందేహాలు నెలకొన్నాయి.

ఇకపోతే దేశవాళీ క్రికెట్​లో సూర్య కుమార్ యాదవ్​కు సూపర్​ రికార్డు ఉంది. 2010లో ముంబయి తరపున అతడు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 5,628 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే 2023లో డిసెంబర్​లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ సమయంలోనూ సూర్య గాయపడ్డాడు. అప్పుడు దాదాపు నాలుగు నెలల తర్వాత ఐపీఎల్​తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఇప్పుడు మరోసారి గాయపడ్డాడు.

కోహ్లీ - రూట్‌లో బెస్ట్​ ఎవరు? గణాంకాలు ఏం చెబుతున్నాయ్​? - Virat Kohli vs Joe Root

'అదే నా లక్ష్యం' - బ్యాడ్మింటన్​లో అదరగొడుతున్న 'జూనియర్' పీవీ సింధు' - Badminton Player Tanvi Patri

ABOUT THE AUTHOR

...view details