Sunil Narine T20 World Cup:వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, తాను టీ20 వరల్డ్‌కప్‌తో జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు. ఈ విషయంపై తాజాగా సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. తాను ఇంటర్నేషనల్ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం, టీ20 వరల్డ్‌కప్‌లో ఆడడం అసాధ్యమని పేర్కొన్నాడు.
'గత కొన్ని రోజులుగా నా పెర్ఫార్మెన్స్ పట్ల నేను సంతోషంగా ఉన్నా. అయితే నేను ఇంటర్నేషనల్ రిటైర్మెంట్ వెనక్కితీసుకొని, ప్రపంచకప్‌లో ఆడాలని కొంతమంది కోరుతున్నారు. వారి ప్రతిపాదనను నేను గౌరవిస్తా. కానీ, జట్టులో రీ ఎంట్రీ ఇవ్వడం మాత్రం జరగని పని. దానికి ఇప్పటికే అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక వెస్టిండీస్ జట్టుకు మాత్రం నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. వాళ్లు ఇంకో టైటిల్ సాధించాలని ఆశిస్తున్నా' అని సోషల్ మీడియాలో నరైన్ తెలిపాడు. ఇక 2019లో భారత్‌తో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడిన నరైన్, గతేడాదే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
కాగా, నరైన్‌ను టీ20 వరల్డ్‌కప్ జట్టులో చూడాలనుకుంటున్నట్లు విండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ రీసెంట్గా చెప్పాడు. దానికోసం అతడిని ఎంతలా అడిగినప్పటికీ ఒప్పుకోలేదని ఓ సందర్భంలో పేర్కొన్నాడు. ఈ క్రమంలో నరైన్‌ను ఒప్పించే బాధ్యత బ్రావో, పూరన్, పొలార్డ్‌కు అప్పగించాడట. కానీ, ఇంతలోనే నరైన్ ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఇక అతడిని పొట్టికప్‌లో చూడలేమని క్లారిటీ వచ్చేసింది.