తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఫీజు విషయంలో డీల్ కుదిరినట్లు లేదు - అందుకే వేలంలోకి పంత్!'

దిల్లీ రిటెన్షన్స్​పై గావస్కర్ స్పందన- రిప్లై ఇచ్చిన పంత్

Rishab Pant IPL Retention
Rishab Pant IPL Retention (Source : Getty Images)

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Rishab Pant IPL Retention :2025 ఐపీఎల్ రిటెన్షన్స్​లో దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రిషభ్ పంత్​ను వదులుకోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయంశమైంది. డాషింగ్ బ్యాటర్, వికెట్ కీపర్, కెప్టెన్సీ లక్షణాలున్న ప్లేయర్​ను దిల్లీ రిటైన్ చేసుకోకపోవడం క్రికెట్ ఫ్యాన్స్​ను ఆశ్చర్యపర్చింది. తాజాగా దీనిపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. పంత్​కు ఫ్రాంచైజీతో పంత్​కు ఫీజు విషయంలో డీల్ కుదరలేదేమోనని గావస్కర్ అన్నాడు. స్టార్ స్పోర్ట్స్ పాడ్​కాస్ట్​లో ఈ విధంగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అయితే దీనిపై పంత్​ కూడా వెంటనే స్పందించాడు. తన రిటెన్షన్‌ అంశం డబ్బుతో ముడి పడి లేదని స్పష్టం చేశాడు.

జరిగింది ఇదీ
మరో 5 రోజుల్లో 2025 ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో గావస్కర్ స్టార్ స్పోర్ట్స్​ పాడ్​కాస్ట్​లో మాట్లాడాడు. ఈ సందర్భంగా పంత్ రిటెన్షన్, దిల్లీ క్యాపిటల్స్​ స్ట్రాటజీ గురించి మాట్లాడాడు. 'దిల్లీ ఫ్రాంచైజీ పంత్​ను అట్టిపెట్టుకోవాలని భావించిందేమో. కానీ, రిటెన్షన్స్​లో ఫీజు విషయంలో ఫ్రాంచైజీకి పంత్​కు మధ్యలో డీల్ కుదరినట్లు లేదు. ఏ ప్లేయరైనా క్రేజ్ ఉన్నప్పుడు ఎక్కువ ఫీజు ఆశిస్తాడు. అలాగే పంత్ కూడా అడిగి ఉండవచ్చు. పర్స్ వ్యాల్యూ లిమిటేషన్స్​ వల్ల ఇద్దరి మధ్య ఒప్పందం కుదినట్లు లేదు. అందుకే అతడిని రిలీజ్ చేయాల్సి వచ్చిందేమో. కానీ, వేలంలో పంత్​ను కొనుగోలు చేయడానికి దిల్లీ ప్రయత్నిస్తుందనుకుంటున్నా. దిల్లీకి పంత్ అవసరం ఉంది' అని గావస్కర్ అన్నాడు.

అయితే ఈ వీడియోకు పంత్ వెంటనే స్పందించాడు. తన రిటెన్షన్‌కు డబ్బుతో సంబంధం లేదని సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చాడు. 'నా రిటెన్షన్ అంశం డబ్బుతో ముడిపడి లేదని నేను కచ్చితంగా చెప్పగలను' అని పంత్ పోస్ట్ చేశాడు.

దిల్లీ క్యాపిటల్స్‌ రిటెన్షన్స్ 2025

  • అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు)
  • కుల్‌దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు)
  • ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు)
  • అభిషేక్ పొరెల్ (రూ.4 కోట్లు)

మొత్తం రూ.120 కోట్ల పర్స్​ వ్యాల్యూలో దిల్లీ రిటెన్షన్స్​ కోసం రూ. 43.75 కోట్లు ఖర్చు చేసింది. ఇక రూ. 76.25 కోట్ల వర్స్ వ్యాల్యూతో మెగా వేలంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే దిల్లీ వద్ద రెండు రైట్ టు మ్యాచ్ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

రిషభ్​ పంత్​పై కన్నేసిన CSK- రైనా హింట్ !

'పంత్ వేలంలోకి వస్తే రూ.30 కోట్లు పక్కా- రాసి పెట్టుకోండి!'

ABOUT THE AUTHOR

...view details