Stuart Broad James Anderson:వెస్టిండీస్ యంగ్ బౌలర్ కెవిన్ సింక్లేర్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో వికెట్ దక్కించుకున్నాక గాలిలో డైవ్ చేసి ఆశ్చర్యపర్చాడు. వికెట్ తీసిన ఆనందంలో కెవిన్ అలా జంప్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయమై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ తన సహచర బౌలర్ జేమ్స్ అండర్సన్ మధ్య ఓ ఫన్నీ సన్నివేశం జరిగింది.
కెవిన్ డైవ్ వీడియోను బ్రాడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ జేమ్స్ అండర్సన్‌కు ట్యాగ్ చేశాడు. తను కూడా ఇలా గాల్లో జంప్ చేయాలని అండర్సన్‌కు కోరాడు.'టెస్టుల్లో 700 వికెట్ల మైలురాయి అందుకున్నాక నువ్వు కూడా ఇలా చేయాలి' అని బ్రాడ్ రాసుకొచ్చాడు. దీనికి అండర్సన్ స్పందిస్తూ 'అలా జంప్ చేయడానికి నేను ప్రాక్టీస్ చేస్తున్నా. వికెట్లు పడాలని నువ్వూ ప్రార్థించు' అని రిప్లై ఇచ్చాడు.
అండర్సన్@690: జేమ్స్ అండర్సన్ ఇప్పటివరకు 183 టెస్టు మ్యాచ్‌లు ఆడి 690 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల లిస్ట్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు), ఆస్ట్రేలియా స్టార్ షేన్ వార్న్ (708 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.