Sri Lanka Cricket suspension lifted : శ్రీలంక క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) శుభవార్త చెప్పింది. లంక క్రికెట్ బోర్డుపై విధించిన నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ఆదివారం తెలిపింది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని చెప్పిన ఐసీసీ మరీ ముఖ్యంగా శ్రీలంక క్రికెట్(SLC) స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందంటూ గతేడాది నవంబర్‌లో లంకపై నిషేధం విధించింది. అయితే, సస్పెన్షన్ విధించినప్పటి నుంచి పరిస్థితులను పర్యవేక్షించింది ఐసీసీ. అప్పటి నుంచి బోర్డు తీసుకుంటున్న చర్యలపట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడల మంత్రి హరిన్ ఫెర్నాండో ఎక్స్ వేదికగా తెలిపారు.
ఇదీ జరిగింది : గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో(ODI World Cup sri lanka) లంక దారుణ ప్రదర్శన చేసింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్‌ఎల్‌సీ బోర్డు సభ్యులపై వేటు వేసింది. క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యం చేసుకోవడంపై ఐసీసీ(ICC Sri lanka ban) అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఎస్‌ఎల్‌సీపై నిషేధం విధించింది. ఈ నిషేధం వల్ల లంక ఈ ఏడాది ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను కూడా కోల్పోయింది. లేదంటే ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచ కప్ టోర్నీ లంకలోనే జరిగేది.