SRH VS LSG IPL 2024 :ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. లఖ్‌నవూ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(75), ట్రావిస్ హెడ్(89) తమదైన శైలిలో రాణించి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. తొలుత దూకుడుగా ఆడినప్పటికీ ఆ తర్వాత కాస్త డీలా పడింది. 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతుల కష్టాల్లో పడింది.
దీంతో ఆ జట్టును ఆదుకునేందుకు క్రీజులోకి వచ్చిన ఆయుశ్ బదోని (55*), నికోలస్ పూరన్ (48*)కీలక ఇన్నింగ్స్‌లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్ (29), కృనాల్ పాండ్య (24) ఫర్వాలేదనిపించారు. ఇక క్వింటన్ డికాక్ (2), స్టాయినిస్ (3) మాత్రం పేలవ ఫామ్‌తో విఫలమయ్యారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ (2/12) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పాట్ కమిన్స్ ఒక వికెట్ పడగొట్టాడు.