తెలంగాణ

telangana

ETV Bharat / sports

తిలక్ వర్మ సూపర్ సెంచరీ - మూడో టీ20లో దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం - SOUTH AFRICA VS INDIA 3RD T20I

భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న మూడో మ్యాచ్​.

South Africa vs India 3rd T20I  TILAK VARMA CENTURY
South Africa vs India 3rd T20I TILAK VARMA CENTURY (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Nov 13, 2024, 10:21 PM IST

Updated : Nov 13, 2024, 10:48 PM IST

South Africa vs India 3rd T20I :సెంచూరియన్‌ వేదికగా భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్​కు దిగిన టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్​ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ (107*; 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో అదరగొట్టాడు. 51 బంతుల్లోనే శతకం బాదాడు. టీ20ల్లో అతడికిదే తొలి సెంచరీ. అభిషేక్ శర్మ (50; 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. హార్దిక్ పాండ్య (18), రమణ్‌దీప్ సింగ్ (15) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సిమోలన్, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు తీయగా, మార్కో యాన్సెన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

Last Updated : Nov 13, 2024, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details