Shreyas Iyer IPL 2024:2024 ఐపీఎల్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. గాయం కారణంగా కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సీజన్ 17 ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం కష్టమేనని కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ నిబంధనల మేరకు ప్రస్తుతం రంజీలో ఆడుతున్న అయ్యర్ ఫైనల్లో ముంబయి తరఫున కీలక పరుగులు చేశాడు. విదర్భతో జరుగుతున్న టైటిల్ పోరు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అయ్యర్ 95 పరుగులు సాధించాడు.
అయితే ఇటీవల వెన్ను నొప్పి నుంచి కోలుకొని రంజీలో ఆడుతున్న అయ్యర్‌కు గాయం మళ్లీ ఇబ్బంది పెడుతోదట. దీంతో రంజీ ముగిసిన తర్వాత అయ్యర్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడని తెలుస్తోంది. 'శ్రేయస్ అయ్యర్‌కు వెన్ను నొప్పి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతోంది. ఈ కారణంగానే రంజీ ఫైనల్లో ఐదో రోజు ఫీల్డింగ్‌కు రాలేదు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతాడు. దీంతో రాబోయే ఐపీఎల్లో ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది' అని క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై కేకేఆర్ యాజమాన్యం నుంచి త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
గతేడాది ఇదే సమస్యతో ఆటకు దూరమైన అయ్యర్ మళ్లీ 2023 వరల్డ్‌కప్ సమయానికి అందుబాటులోకి వచ్చాడు. ఇక రీసెంట్గా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మరోసారి వెన్ను నొప్పి అయ్యర్‌ను ఇబ్బంది పెట్టడం వల్ల మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో రంజీలో ఆడుతున్న అయ్యర్‌కు మళ్లీ ఇదే సమస్య పునరావృతం అయ్యింది. ఇక అయ్యర్ గైర్హాజరీలో సీనియర్ బ్యాటర్ మనీశ్ పాండే అతడిని రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఇక యంగ్ బ్యాటర్ నితీశ్ రానా కేకేఆర్ కెప్టెన్సీగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. ఇక 2024 ఐపీఎల్లో మార్చి 23న కేకేఆర్ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడాల్సి ఉంది.