Shreyanka Patil Asia Cup 2024 :ఆసియా కప్‌లో తొలి విజయం సాధించి మంచి ఊపు మీదున్న టీమ్ఇండియా మహిళల జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఆసియాకప్‌కు దూరమైంది.
ఎడమ చేతి నాలుగో వేలికి ఫ్రాక్చర్ కారణంగా ఆసియా కప్‌నకు శ్రేయాంక పాటిల్ దూరమైందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పుడు శ్రేయాంక పాటిల్ స్థానంలో తనూజా కన్వర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. కన్వర్‌కు భారత జట్టులో తొలిసారి స్థానం దక్కడం విశేషం.
దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో శ్రేయాంక అద్భుతంగా బౌలింగ్ చేసింది. 3.2 ఓవర్లలో 4.2 ఎకానమీతో కేవలం 14 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. మంచి స్పిన్‌తో పాక్ బ్యాటర్లను కట్టడి చేస్తూ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. శ్రీలంక పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న వేళ శ్రేయాంక ఆసియా కప్ తదుపరి మ్యాచ్‌లకు దూరం కావడం టీమ్ఇండియాకు ఎదురు దెబ్బ అనే చెప్పాలి.
మహిళల ఆసియా కప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తొలి విజయంతో శుభారంభం చేసింది. పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించింది. దంబుల్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో పాక్‌ను చిత్తుగా ఓడించి బోణీ కొట్టింది. పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని కేవలం 108 పరుగులకే పరిమితమైంది.