తెలంగాణ

telangana

ETV Bharat / sports

'3 ఏళ్లుగా సానియాను చీట్ చేస్తున్న షోయబ్- ఎక్కడికి పిలిచినా సనా వెంట ఉండాల్సిందే!' - Shoaib Sania Divorce

Shoaib Cheated Sania:టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను, క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడేళ్లుగా మోసం చేస్తున్నాడంటూ పాకిస్థాన్ టీవీ ఛానెల్ ఓ ప్రోగ్రామ్​లో తెలిపింది.​

Shoaib Cheated Sania
Shoaib Cheated Sania

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 8:03 PM IST

Shoaib Cheated Sania:పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ నటి సనా జావేద్​ను షోయబ్ ఇటవల పెళ్లి చేసుకున్న నేపథ్యంలో అతడి మాజీ భార్య, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఆ దేశ​ ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. అయితే షోయబ్- సనా జావేద్​తో ​రిలేషన్​లో ఉంటూనే మూడేళ్లుగా సానియాను చీట్ చేస్తున్నాడని పాకిస్థాన్​కు చెందిన ఓ టీవీ ఛానెల్ తెలిపింది.

'షోయబ్ మాలిక్- సనా జావేద్​తో మూడేళ్లుగా రిలేషన్ కొనసాగిస్తున్నాడు. అప్పటినుంచి సానియాను చీట్ చేస్తూ వచ్చాడు. షోయబ్​ను ఏదైనా టీవీ ప్రోగ్రామ్​కు ఆహ్వానిస్తే, సనాను కూడా పిలవాల్సిందిగా షరతులు పెట్టేవాడు. అయితే ఈ రిలేషన్​ గురించి సనా మాజీ భర్త ఉమెర్ జస్వాల్​కు తెలీదు. కానీ, సానియా ఫ్యామిలీతోపాటు, షోయబ్ కుటుంబ సభ్యులకు ఏడాది కిందటే ఈ విషయం తెలుసు. అప్పటినుంచి ఇరు కుటుంబాలు అతడికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా, షోయబ్ ఎవరి మాట వినలేదు. మరోవైపు షోయబ్​తో పెళ్లికి మూడు నెలల ముందే సనా తన మాజీ భర్త ఉమెర్ జస్వల్​కు విడాకులు ఇచ్చింది' అని టీవీ ఛానెల్ పాడ్​కాస్ట్ ప్రోగ్రామ్​లో పేర్కొంది.

కాగా, షోయబ్ మాలిక్ 2010లో తన మొదటి భార్య ఆయేషా సిద్దిఖీకి విడాకులు ఇచ్చి అదే ఏడాది సానియాను పెళ్లాడాడు. వీరికి 2018లో ఇజహాన్ అనే కుమారుడు జన్మించాడు. అయితే కొంతకాలంగా సానియా- షోయబ్ విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. ఇక సానియా కొన్ని నెలల ముందే షోయబ్​కు ఖులా (ముస్లిం మహిళలు తమ వైపు నుంచి విడాకులు ఇవ్వడం) పద్దతిలో విడాకులు ఇచ్చిందని, అతడు మూడో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు సనా జావేద్​ కూడా 2020లో పాకిస్థాన్ సింగర్ ఉమెర్ జస్వాల్​ను పెళ్లాడింది.

ఫిక్సింగ్ వివాదంలో షోయబ్:షోయబ్ మాలిక్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కున్నాడు.ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్​లో ఆడుతున్న షోయబ్, జనవరి 22నాటి మ్యాచ్​లో వరుసగా మూడు నో బాల్స్ వేశాడు. దీంతో అతడు ఫిక్సింగ్​కు పాల్పడ్డాడన్న అనుమానంతో షోయబ్​తో సంబంధిత ఫ్రాంచైజీ కాంట్రాక్ట్​ను రద్దు చేసుకుంది.

'వాళ్ల బంధం అప్పుడే ముగిసింది- డివోర్స్​పై సానియా ఫ్యామిలీ క్లారిటీ'

షోయబ్ మాలిక్ 'మూడో పెళ్లి'- సానియా పరిస్థితేంటి?

ABOUT THE AUTHOR

...view details