తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ గురించి శివమ్​ దూబె వైఫ్​ పోస్ట్ - 'ఆయన కోసం ఇంకాస్త ఎక్కువ అరుస్తాను' - Shivam Dube Wife Emotional Post

Shivam Dube Wife Emotional Post : చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఆ జట్టు ప్లేయర్ శివమ్ దూబె సతీమణి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆయన్ను మొదటిసారి చూసిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం.

Shivam Dube Wife
Shivam Dube Wife

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 5:59 PM IST

Shivam Dube Wife Emotional Post :చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్, టీమ్​ఇండియా​ ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి ఉన్న ఫ్యాన్​ ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన బ్యాట్ పట్టుకుని స్టేడియంకు వచ్చాడంటే ఇక అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అతడ్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది ధోనీకి వీరాభిమానులుగా ఉన్నారు. తాజాగా చెన్నై జట్టు ప్లేయర్ శివమ్‌ దూబె భార్య అంజుమ్‌ ఖాన్ కూడా ఇదే విషయంపై నెట్టింట షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

"మహీ టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోజులవి. మొదటిసారి నేను ఓ న్యూస్‌ ఛానెల్‌లో ఆయన పేరు విన్నాను. ఆయన గురించి తెలియనంత వరకు నాకు క్రికెట్‌ అంటే ఇష్టం మాత్రమే ఉండేది. కానీ, నాకు తెలియకుండానే ఆ రోజు ఆ ఇంటర్వ్యూ మొత్తాన్ని ఎందుకు చూశానో తెలియదు. అది నాకు సాధారణంగా అనిపించలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు క్రికెట్‌ మ్యాచ్‌లన్నింటినీ చూస్తాను. ధోనీ ఆడే మ్యాచ్​లను మాత్రం అసలు మిస్సవ్వను. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో మహీ ఉంటే గెలిపిస్తారన్న ధైర్యం ఉంటుంది. ధోనీ అంటే క్రికెట్‌, క్రికెట్‌ అంటే ధోనీ" అంటూ ఎమోషనలయ్యారు. ఇక ఇదే పోస్ట్​లో ఆమె మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి చెప్పారు.

"మొదటి సారి ధోనీని చూసినప్పుడు పొడవాటి హెయిర్‌ స్టైల్‌తో కనిపించారు. అప్పుడు నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. నేను ఎంతో ఎమోషనల్‌గానూ కనెక్ట్‌ అయ్యాను. ఆయన్ను కలవాలనే ఆశ నా భర్త శివమ్‌ ద్వారా నెరవేరింది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో శివమ్‌కు మద్దతుగా అరుస్తూ ఉండేదాన్ని. కానీ, అక్కడ ధోనీ ఉంటే మాత్రం ఇంకాస్త ఎక్కువగానే అరుస్తుంటాను. ఆయన టీమ్‌లో శివమ్‌ కూడా ఉండాలనేదే నా కోరిక. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి" అంటూ తన మనసులోని మాట చెప్పారు.

ఇది చూసి పలువురు ఫ్యాన్స్​ కూడా ఎమోషనలయ్యారు. "అంజుమ్‌, ఈ రోజు మీరూ మా అభిమానాన్ని గెలుచుకున్నారు", "మీరు ఎంత ఎమోషనల్​గా ఈ పోస్టు పెట్టారో మేము అర్థం చేసుకోగలము" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

శివమ్, అంజూల జర్నీ - ఓ హిందూ ముస్లిం ప్రేమ కథ - Shivam Dube Love Story

చెన్నై ఓడినా శివమ్ దూబె ధమాకా ఇన్నింగ్స్​ - సిక్సర్ల మోత! - IPL 2024 Sunrisers VS CSK

ABOUT THE AUTHOR

...view details