తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిటైర్మెంట్ ప్రకటించిన నదీమ్- 2 దశాబ్దాల జర్నీ ఎండ్! - shahbaz nadeem Ranji Trophy

Shahbaz Nadeem Retirement: టీమ్ఇండియా ఆటగాడు షాదాబ్ నదీమ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై కేవలం డొమెస్టిక్ లీగ్​ల్లో నదీమ్ ఆడనున్నాడు.

Shahbaz Nadeem Retirement
Shahbaz Nadeem Retirement

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 7:23 PM IST

Updated : Mar 5, 2024, 9:36 PM IST

Shahbaz Nadeem Retirement:టీమ్ఇండియా ఆటగాడు షాదాబ్ నదీమ్ అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పాడు. మూడు ఫార్మాట్​లతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్​ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు నదీమ్ తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. దీంతో దాదాపు 2 దశాబ్దాలపాటు సాగిన నదీమ్ కెరీర్​ జర్నీ ముగిసినట్లైంది. తన కెరీర్​లో సహకరించి అవకాశాలు కల్పించిన బీసీసీఐ, ఝూర్ఖండ్ క్రికెట్ అసోసియేషన్, టీమ్​మేట్స్, కోచ్​కు కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా తన మొదటి కోచ్​ ఇమ్తియాజ్ హుస్సెన్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. తన సుదీర్ఘ కెరీర్​లో కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రాత్సహించారని నదీమ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.

నదీమ్​కు డొమెస్టిక్​లో ఘనమైన రికార్డ్ ఉంది. 2004లో ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో అరంగేట్రం చేసిన నదీమ్​కు 2019లో టీమ్ఇండియా పిలుపు అందింది. 2019లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టుతో ఇంటర్నేషనల్ కెరీర్ ప్రారంభించిన నదీమ్ 2టెస్టుల్లో 8 వికెట్లు పడగొట్టాడు. 2015- 16 (51 వికెట్లు), 2016- 17 (55 వికెట్లు) రెండు సీజన్​లలో రంజీలో అత్యధిత వికెట్లు పడగొట్టిన బౌలర్​గా నిలిచాడు. ఇక లిస్ట్​ A కెరీర్​లో 134 మ్యాచ్​లు ఆడిన నదీమ్ 175 వికెట్లు కూల్చాడు. 2018- 19 సీజన్ విజయ్ హరారే ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నదీమ్ 24 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక ఇదే సీజన్​లో లిస్ట్​- Aలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 10 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టి రికార్డ్ సాధించాడు.

ఇక 2011లో ఐపీఎల్​లో దిల్లీ డేర్​డెవిల్స్ (ఇప్పటి దిల్లీ క్యాపిటల్స్) తరఫున అరంగేట్రం చేశాడు. 2011- 2018 మధ్యలో దిల్లీ, 2019- 2021 సీజన్​లలో సన్​రైజర్స్ హైదరాబాద్, 2021- 2023లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ ఫ్రాఛైంజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్​లో 72 మ్యాచ్​లు ఆడిన నదీమ్ 48 వికెట్లు పడగొట్టాడు. కానీ, గత రెండు సీజన్​లలోనూ బరిలోకి దిగని నదీమ్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఐపీఎల్​లో చివరి మ్యాచ్ ఆడాడు.

అవన్నీ ఫేక్- మీ టాలెంట్​నే నమ్మకోండి: సర్ఫరాజ్ తండ్రి

చెన్నై జట్టుకు ఊహించని షాక్​ - జట్టుకు దూరం కానున్న కాన్వే!

Last Updated : Mar 5, 2024, 9:36 PM IST

ABOUT THE AUTHOR

...view details