Sachin Impressed Young girls Bowling : ఓ చిన్నారి బౌలింగ్‌కు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఫిదా అయిపోయాడు. సుశీలా మీనా అనే బాలిక బౌలింగ్ చేస్తున్న వీడియోను ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేశారు. ఆమె బౌలింగ్‌లో జహీర్ ఖాన్ స్టైల్ కనబడుతోందని చెబుతూ ట్యాగ్ చేశారు. "ఎంతో మృదువుగా, చూసేందుకు అద్భుతంగా ఉన్న సుశీలా మీనా బౌలింగ్‌లో నీ షేడ్స్ కనబడుతున్నాయ్. జహీర్ నువ్వూ చూశావా?" అని పోస్టులో పేర్కొన్నారు.
ఆ బాలిక బౌలింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆమె బౌలింగ్ స్టైల్‌ను చూసిన నెటిజన్లు "జూనియర్ జహీర్ ఖాన్, అవును అలాంటి బౌలింగే, ఇంత చిన్న వయసులో గొప్పగా బౌలింగ్ చేస్తోంది" అని ప్రశంసలు కురిపిస్తూ తెగ కామెంట్లు చేస్తున్నారు.