తెలంగాణ

telangana

ETV Bharat / sports

సర్ఫరాజ్‌ ఖాన్ 'డబుల్' ట్రీట్​ - ఇరానీ కప్​లో ద్వీశతకంలో అదుర్స్​ - Irani Cup 2024

Sarfaraz Khan Irani Cup 2024 : రెస్ట్ ఆఫ్‌ ఇండియా, ముంబయి మధ్య జరుగుతున్న ఇరానీ కప్​ టోర్నీలో టీమ్‌ఇండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్ అదరగొడుతున్నాడు. 253 బంతుల్లోనే 23 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో అతడు డబుల్ సెంచరీ సాధించాడు.

Sarfaraz Khan Irani Cup 2024
Sarfaraz Khan (IANS)

By ETV Bharat Sports Team

Published : Oct 2, 2024, 7:14 PM IST

Sarfaraz Khan Irani Cup 2024 : రెస్ట్ ఆఫ్‌ ఇండియా, ముంబయి మధ్య ఇరానీ కప్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీలో ముంబయి తరఫున ఆడుతున్న టీమ్‌ఇండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్ అద్భుతమైన పెర్ఫామెన్స్​తో ఆకట్టుకుంటున్నాడు. 253 బంతుల్లో 23 ఫోర్లు, 3 సిక్స్‌ల సహాయంతో అతడు తాజాగా డబుల్ సెంచరీ సాధించాడు.అంతకుముందే 150 బంతుల్లో శతకం బాదిన సర్ఫరాజ్‌, మరో 103 బంతుల్లో ద్విశతకాన్ని సాధించాడు.

ఈ నేపథ్యంలో ఇరానీ కప్‌లో ముంబయి తరఫున డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గానూ సర్ఫరాజ్ నయా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పాటు ఇరానీ కప్‌లో అతి పిన్న వయసు (26 ఏళ్ల 346 రోజులు)లో ద్విశతకం సాధించిన నాలుగో ఆటగాడిగానూ సర్ఫరాజ్‌ అరుదైన ఘనత సాధించాడు.

అయితే ఈ లిస్ట్​లో మరో స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ (21 ఏళ్ల 63 రోజులు) టాప్ పొజిషన్​లో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రవీణ్ ఆమ్రే (22 ఏళ్ల 80 రోజులు), గుండప్ప విశ్వనాథ్‌ (25 ఏళ్ల 255 రోజులు) వరుసగా రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, రెండో రోజు 132 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ముంబయి 516/8 స్కోరుతో ఉంది. సర్ఫరాజ్‌ (216*), శార్దూల్ ఠాకూర్‌ (21*) క్రీజులో ఉన్నారు.

అయితే ఇటీవల జరిగిన బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు సర్ఫరాజ్‌ ఎంపికయ్యాడు. కానీ, రెండు టెస్టుల్లోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. దీంతో తొలి టెస్టు జరిగినప్పుడు దులీప్ ట్రోఫీ కోసం, అలాగే రెండో టెస్టులో సమయంలో ఇరానీ కప్‌ కోసం జట్టు నుంచి అతడిని రిలీజ్‌ చేశారు.

ఇప్పుడీ డబుల్ సెంచరీతో సర్ఫరాజ్ సెలక్టర్లకు హింట్ ఇచ్చినట్లు క్రికెట్ విశ్లేషకుల మాట. అక్టోబర్‌ 16 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్‌లో తనను తుది జట్టులోకి తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సర్ఫరాజ్​కు మళ్లీ నిరాశే! - రెండో టెస్ట్​ నుంచి రిలీజ్​ - ఎందుకంటే? - IND VS BAN Sarfaraz Khan

పుజారా, రహానే స్థానాలు భర్తీ చేసేది వాళ్లే: దినేశ్ కార్తిక్ - Pujara Rahane Replacement Tests

ABOUT THE AUTHOR

...view details