Sarfaraz Khan Celebrates Yashasvi 200:రాజ్‌కోట్ టెస్టులో యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీని నాన్ స్ట్రైక్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ సెలబ్రేట్ చేసుకోవడం ఇంటర్నెట్లో అందర్నీ ఆకర్షిస్తోంది. గతంలో విరాట్ కోహ్లీ శతకాన్ని సురేశ్ రైనా సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్‌ను సర్ఫరాజ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడంటూ నెటిజన్లు వీడియోను వైరల్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో జైశ్వాల్ 199 వద్ద బ్యాటింగ్ చేస్తుండగా, రూట్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడాడు. బంతి ఆఫ్ సైడ్ ఫిల్డర్ వద్దకు వెళ్లగా జైశ్వాల్- సర్ఫరాజ్ పరుగు తీయడం ప్రారంభించారు. ఇక సింగిల్ రావడం ఖాయం కాగానే, ఇద్దరూ చేతులు గాల్లోకి ఎత్తి సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం జైశ్వాల్‌కు ఓ హగ్ ఇచ్చి సర్ఫరాజ్ కంగ్రాట్స్ చెప్పాడు. అయితే 2015 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ శతకం సాధించాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ సెంచరీని నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న సురేశ్ రైనా సెలబ్రేట్ చేసుకోవడం అప్పట్లో క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. తాజాగా సర్ఫరాజ్ ఆ సీన్ రిపీట్ చేసి రైనాను గుర్తుచేశాడని కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో జైశ్వాల్ 234 బంతుల్లో 214 పరుగులు చేశాడు.