తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వాళ్ల బంధం అప్పుడే ముగిసింది- డివోర్స్​పై సానియా ఫ్యామిలీ క్లారిటీ' - Sania Shoaib Malik news latest

Sania Divorced Shoaib: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్​లు విడాకుల విషయంపై ఆమె ఫ్యామిలీ మెంబర్స్ క్లారిటీ ఇచ్చారు. సానియా కొన్ని నెలల కిందటే షోయబ్​కు డివోర్స్ ఇచ్చిందని చెప్పారు.

Sania Divorced Shoaib
Sania Divorced Shoaib

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 12:13 PM IST

Updated : Jan 21, 2024, 12:30 PM IST

Sania Divorced Shoaib:భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన మాజీ భర్త షోయబ్​ మాలిక్​కు కొన్ని నెలల ముందే విడాకులు ఇచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం (జనవరి 20) షోయబ్, పాకిస్థాన్ నటి సనా జావేద్​ను మూడో పెళ్లి చేసుకున్న తర్వాత సానియా ఫ్యామిలీ మెంబర్స్ డివోర్స్ మ్యాటర్ బయటపెట్టారు.

'సానియా తన పర్సలైల్ లైఫ్​ను గోప్యంగానే ఉంచుతుంది. అందుకే ఆమె షోయబ్​కు కొన్ని నెలల ముందే విడాకులు ఇచ్చిన విషయాన్ని ఈరోజు చెప్పాల్సి వస్తోంది. కొత్త జీవితం ప్రారంభించిన షోయబ్​కు సానియా శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఆమె జీవితంలో ఇది చాలా సెన్సిటివ్ పీరియడ్. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్, వెల్ విషర్స్ ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతున్నాం' అని సానియా కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇక షోయబ్​కు ఇది మూడో పెళ్లి. అతడు తొలిసారి 2002లో ఆయేషా సిద్ధిఖిని పెళ్లాడాడు. ఆమెకు 2010లో విడాకులు ఇచ్చి, అదే ఏడాదిలో ఏప్రిల్​లో సానియాను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 2018లో ఇజహాన్ (కుమారుడు) జన్మించాడు. కొంత కాలంగా సానియా, షోయబ్ విడిపోనున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ జంట అప్పట్లో దీనిపై స్పందించలేదు. అయితే తాజాగా సానియా స్పందించి ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​ ఓ పోస్ట్ షేర్ చేసింది.'పెళ్లి కష్టం, విడిపోవడం కష్టం. మీ కష్టాన్ని తెలివిగా ఎంచుకోవాలి' అని రాసుకొచ్చింది. దీంతో సానియా తన డివోర్స్ విషయాన్ని పరోక్షంగా తెలిపింది. అయితే కుమారుడు ఇజహాన్ ప్రస్తుతం సానియాతోనే ఉంటున్నాడు. అటు సనా జావేద్​కు ఇది రెండో వివాహం. 2020లో ఆమె పాక్ సింగర్​ను పెళ్లి చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది కాలానికి విడిపోయారు.

Sania Mirza Retirement: 37 ఏళ్ల సానియా గతేడాది టెన్నిస్​కు గుడ్​బై చెప్పింది. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా టెన్నిస్ ఆడిన సానియా అనేక రికార్డులు సాధించింది. ఆమె డబుల్స్, మిక్స్​డ్ డబుల్స్​ ఈవెంట్స్​లో 6 గ్రాండ్​ స్లామ్​ టైటిళ్లు నెగ్గింది.

ఎట్టకేలకు గెలిచిన పాక్- 'అష్రఫ్​' రాజీనామాతో జట్టుకు మంచి రోజులు!

షోయబ్ మాలిక్ 'మూడో పెళ్లి'- సానియా పరిస్థితేంటి?

Last Updated : Jan 21, 2024, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details