తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ పర్సనల్ మేనేజర్​ ఆమెనే! - హిట్​మ్యాన్​ సతీమణి నెట్​వర్త్ ఎంతంటే ? - Rohit Sharma Wife Net Worth

Rohit Sharma Wife Net Worth : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ హిట్​మ్యాన్​ సతీమణి రితికా సాజేద్ నెట్​వర్త్ ఎంతంటే ?

Rohit Sharma Wife Net Worth
Rohit Sharma Wife Net Worth

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 4:13 PM IST

Rohit Sharma Wife Net Worth : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2006 నుంచి క్రికెట్ ఫీల్డ్​లో ఉన్న ఈ స్టార్​, అన్నీ ఫార్మాట్లలోనూ సత్తా చాటాడు. ఓ ప్లేయర్​గానే కాకుండా ఓ కెప్టెన్​గానూ కీలక బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే ఆయన విజయం వెనక ఆయన ఫ్యామిలీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉందని రోహిత్ పలు మార్లు చెప్పాడు.

అటు బీసీసీఐ, ఇటు ఐపీఎల్ మ్యాచులతో బిజీగా ఉండే రోహిత్​ ఎప్పుడూ కూల్​గా కనిపిస్తుంటాడు. దానికి కారణం తన బెటర్ హాఫ్ రితికా కూడా తన పనుల్లో సహాయం అందిస్తుంటారు. రోహిత్​ కాంట్రాక్టుల నుంచి తన పర్సనల్ విషయాల వరకు అన్నీ దగ్గరుండి చూసుకుంటారు రితికా

మైదానంలో రోహిత్ మెరుపులు మెరిపిస్తుంటే గ్యాలరీలో కూర్చొని అతడ్ని ఎంకరేజ్ చేస్తూ చిరునవ్వు చిందించే రితిక నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 10 కోట్లు. ఒకప్పుడు రితిక స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్​గా పనిచేసేవారు. వివాహానికి ముందు రితిక తన సోదరుడితో కలిసి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అనేక లాభదాయకమైన ఎండార్స్‌మెంట్ ఒప్పందాలను అందించారు.

యాడ్​ షూట్​లో లవ్​ స్టోరీ
అయితే రోహిత్ రితికను ఓ యాడ్ షూట్​లో తొలిసారిగా చూశాడు. మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌, రోహిత్‌ కలిసి 2008లో ఓ యాడ్ చేశారు. ఆ షూట్​కి మేనేజర్​ రితిక. అప్పటికే రితికతో యువీకి ఓ ప్రత్యేక అనుబంధం ఉండేది. రితికను ఆయన తన సొంత చెల్లిలా భావించేవారు యువరాజ్‌ సింగ్‌. దీంతో రితికాకు దూరంగా ఉండమంటూ రోహిత్​కు వార్నింగ్ కూడా ఇచ్చారట. అయితే తొలుత దూరంగానే ఉన్న రోహిత్ ఆ తర్వాత మరో షూట్‌లో వీరి పరిచయం పెరిగింది. తొలి సారి ఆమెను అంతగా పట్టించుకోని హిట్​మ్యాన్​, రెండోసారి కలిసినప్పుడు మాత్రం ఆమె వ్యవహరించిన తీరుకు ఫిదా అయ్యాడు. స్లోగా వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. అది క్రమ క్రమంగా స్నేహం పెరిగింది. కొద్ది రోజుల్లోనే రోహిత్‌కు స్పోర్ట్స్‌ మేనేజర్‌గా పనిచేయడం మొదలుపెట్టారు రితిక.

ఇక ప్రొఫెషనల్‌గా దగ్గరైన రోహిత్‌- రితిక, ఆ తర్వాత మంచి స్నేహితులుగా మారారు. ఆమె వ్యక్తిత్వానికి ఆకర్షితుడై ఆమెను పెళ్లాడని నిర్ణయించుకున్నాడు. తనకు ఏంతో ప్రత్యేకమైన బోరివలీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు రితికను తీసుకువెళ్లి అక్కడ తన మనసులోని మాటను బయటకు చెప్పాడు. ఇక రోహిత్​ ప్రపోజల్​ను యస్ చెప్పారు రితికా. ఈ ప్రేమ జంట ఆరేళ్ల తర్వాత పెద్దలను ఒప్పించి 2015లో ముంబయిలోని తాజ్‌ ల్యాండ్స్‌ హోటల్​లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2018లో వీరిద్దరికి సమైరా అనే కుమార్తె జన్మించింది.

ప్రస్తుతం రోహిత్ ఫ్యామిలీ ముంబయి వోర్లీలోని ఓ విలాసవంతమైన బీచ్ వ్యూ 4-BHK అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థల నివేదికల ప్రకారం 6,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ కోసం హిట్ మ్యాన్ సుమారు రూ. 30 కోట్లు ఖర్చు చేశాడని తెలుస్తోంది.

స్పెషల్ హెలికాప్టర్​లో రోహిత్- హాలీవుడ్ హీరో లెవెల్​ ఎంట్రీ!

బిజినెస్​లోనూ రోహిత్ మార్క్​- హిట్​మ్యాన్ నెట్​వర్త్​ ఎంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details