తెలంగాణ

telangana

డొమెస్టిక్ టోర్నీలో రోహిత్, విరాట్- స్టార్ల రాకతో దేశవాళీ క్రికెట్​లో ఫుల్ జోష్! - Rohit Sharma Duleep Trophy

By ETV Bharat Sports Team

Published : Aug 12, 2024, 1:56 PM IST

Rohit Virat Duleep Trophy: టీమ్ఇండియా స్టార్లు రోహిత్, విరాట్ మళ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీల్ ఈ స్టార్లు ఇద్దరూ ఆడనున్నారని సమాచారం.

Rohit Virat Duleep Trophy
Rohit Virat Duleep Trophy (Source: Getty Images)

Rohit Virat Duleep Trophy:టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత డొమెస్టిక్ టోర్నమెంట్​లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ 2024 దులీప్ ట్రోఫీలో ఆడబోతున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌పై దృష్టిలో ఉంచుకున్న రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ దులీప్‌ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దులీప్‌ టోర్నీ సెప్టెంబర్ 5న ప్రారంభం కానుంది. టోర్నీలో ఒక రౌండ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించనున్నారు.

ఈ దశలోనే రోహిత్‌, విరాట్‌ పాల్గొననున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే రోహిత్ శర్మ దాదాపు 9ఏళ్ల తర్వాత డొమెస్టిక్ టోర్నీలో రీ ఎంట్రీ ఇస్తాడు. అయితే రోహిత్, విరాట్ ఆయా జట్ల సభ్యులుగా ఉంటారా, కెప్టెన్లుగా బరిలో దిగుతారా అన్నది క్లారిటీ లేదు. ఇక మిగిలిన ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌ను దులీప్ ట్రోఫీలో ఆడాలని కోరినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కానీ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం ఈ టోర్నీ నుంచి మినహాయింపు ఉన్నట్లు సమాచారం.

భవిష్యత్తు దృష్ట్యానే
వచ్చే నాలుగు నెలల్లో టీమ్ఇండియా 10 టెస్టులు ఆడనుంది. ఇందులో ఆస్ట్రేలియాలో 5 టెస్టులు ఆడనుంది. బంగ్లాదేశ్ సిరీస్‌లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయని దానికి తగ్గట్లు సిద్ధం కావాలని సెలక్షన్ కమిటి భావిస్తోంది. మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉండడం వల్ల బంగ్లా సిరీస్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వవచ్చు. దులీప్ ట్రోఫీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో జరగాల్సి ఉంది. అయితే అనంతపురానికి ఎయిర్‌ కనెక్టివిటీ లేకపోవడం వల్ల స్టార్‌ క్రికెటర్లు రావడం అనుమానంగా మారింది. దీంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఒక రౌండ్‌ దులీప్‌ ట్రోఫీని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.

టోర్నీ విశేషాలు
ఈ టోర్నీలో జట్లు జోన్ల వారిగా ఉంటాయి. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ మొత్తం 5 జోన్స్ ఉంటాయి. ఆయా జోన్లకు సంబంధించిన క్రికెటర్లు తమతమ జోన్స్ తరఫు బరిలో దిగుతారు. సెప్టెంబర్ 5 నుంచి 24వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. అయితే బంగ్లాదేశ్​తో టీమ్ఇండియా టెస్టు సిరీస్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. అంటే రోహిత్, విరాట్​సహా స్టార్ ప్లేయర్లు టోర్నీ చివరి దాకా ఆడకపోవచ్చు.

'రిస్క్ చేయడానికి భయపడను- ఆ విషయంలో తగ్గేదేలే' - Rohit Sharma

రోహిత్ ఖాతాలో మరో రికార్డు - కెప్టెన్​గా అత్యధిక సిక్స్​లు బాదిన టాప్-5 బ్యాటర్స్ వీరే - Rohith Sharma Sixes Record

ABOUT THE AUTHOR

...view details