తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెంచరీతో కదం తొక్కిన హిట్​మ్యాన్- కెరీర్​లో 47వ శతకం పూర్తి - రోహిత్ శర్మ టెస్టు సెంచరీలు

Rohit Sharma Test Century: రాజ్​కోట్​ టెస్టులో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్​ 52.3 ఓవర్​ వద్ద రోహిత్ టెస్టు కెరీర్​లో 11వ శతకం అందుకున్నాడు.

Rohit Sharma Test Century
Rohit Sharma Test Century

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 2:37 PM IST

Updated : Feb 15, 2024, 4:10 PM IST

Rohit Sharma Test Century:రాజ్​కోట్ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ (131 పరుగులు: 196 బంతుల్లో; 14x4, 3x6)తో కదం తొక్కాడు. 155 బంతుల్లో శతరం పూర్తి చేసి టెస్టు కెరీర్​లో 11వ సెంచరీ అందుకున్నాడు. కాగా, మూడు ఫార్మాట్​లలో కలిపి ఓవరాల్​గా రోహిత్​కు ఇది 47వ అంతర్జాతీయ శతకం.

ఈ ఇన్నింగ్స్​తో రోహిత్ మరికొన్ని రికార్డులు అందుకున్నాడు. టెస్టుల్లో రోహిత్ టీమ్ఇండియా తరఫున అత్యధిక సిక్స్ (79)​లు బాదిన రెండో క్రికెటర్​గా నిలిచాడు. అతడు ఈ ఇన్నింగ్స్​లో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్​ ధోనీ (78)ని అధిగమించాడు. కాగా, మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ (90) ఈ లిస్ట్​లో టాప్​లో ఉన్నాడు. ఇక కెప్టెన్​గా మూడు ఫార్మాట్​లలో కలిపి అత్యధిక సిక్స్​లు బాదిన భారత ప్లేయర్​గాను రోహిత్ రికార్డు కొట్టాడు. ప్రస్తుతం రోహిత్ 212 సిక్స్​లతో టాప్​లో ఉన్నాడు. ఓవరాల్​గా ఇంగ్లాండ్ ప్లేయర్ ఇయాన్ మోర్గాన్ (233) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ (10), శుభ్​మన్ గిల్ (0) స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యారు. ఇక మిడిల్​లో వచ్చిన రజత్ పటీదార్ (5) మరోసారి విఫలమయ్యాడు. అతడు స్పిన్నర్ హార్ట్లీ బౌలింగ్​లో క్యాచౌట్​గా పెవిలియన్ చేరాడు. 33 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయిన దశలో రోహిత్, ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్​ను గాడిలో పెట్టాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన రోహిత్- జడేజా స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఇంగ్లాండ్ బౌలర్లలకు ఛాన్స్ ఇవ్వలేదు. మరోఎండ్​లో ఉన్న జడేజా కూడా ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్​కు 204 భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీ తర్వాత దూకుడు పెంచిన రోహిత్ 131 పరుగుల వద్ద భారీ షాట్​కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.

ఆ ఇద్దరు అరంగేట్రం: ఈ మ్యాచ్​లో యంగ్ ప్లేయర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. సర్ఫరాజ్​కు మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే క్యాప్ అందించగా, సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ చేతులమీదుగా జురెల్​ డెబ్యూ క్యాప్ అందుకున్నాడు.

రితికా విషయంలో యువీ స్ట్రాంగ్​ వార్నింగ్ - రోహిత్​ను అలా అన్నాడట!

క్రికెట్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్ - రోహిత్‌ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్‌

Last Updated : Feb 15, 2024, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details