తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నా వైఫ్​ చూస్తుంది, నేను అస్సలు చెప్పను'- మంధానకు రోహిత్ షాకింగ్ ఆన్సర్​ - ROHIT SHARMA

BCCI అవార్డ్స్​లో రోహిత్ శర్మ సందడి- స్మృతి మంధాన ప్రశ్నకు హిట్​మ్యాన్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్​

Rohit Sharma Teasing
Rohit Sharma Teasing (Source : BCCI 'X' Screenshot)

By ETV Bharat Sports Team

Published : Feb 2, 2025, 10:25 AM IST

Rohit Sharma BCCI Awards :టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కాస్త మతిపరుపు అని, ట్రావెలింగ్​లో అప్పుడప్పుడు తన వస్తువులు కూడా మర్చిపోతుంటాడని టీమ్​మేట్స్​ పలు సందర్భాల్లో చెబుతుంటారు. అయితే దీనిపై రోహిత్ మరోసారి స్పందించాడు. అవన్నీ నిజం కాదని అన్నాడు. ముంబయిలో శనివారం జరిగిన బీసీసీఐ అవార్డుల కార్యక్రమానికి హాజరైన రోహిత్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఈ ఈవెంట్​లో రోహిత్​తోపాటు హార్దిక్ పాండ్య, మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ చిన్న​ చిట్​చాట్​లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే హిట్​మ్యాన్​ను స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ఆసక్తికర ప్రశ్న అడిగింది. 'నీకు ఉన్న ఏ అలవాటును సహచర ఆటగాళ్లు ఎగతాళి చేస్తారు?' అని అడిగింది. దీనికి రోహిత్ ఇచ్చిన జవాబు ఈవెంట్​లో నవ్వులు పూయించింది.

'నేను వస్తువులు మర్చిపోతుంటానని నా టీమ్​మేట్స్​ నన్ను టీజ్ చేస్తారు. అయితే మర్చిపోవడం అనేది నా అలవాటు కాదు. నేను వాలెట్, పాస్​పోర్ట్ మర్చిపోతానని వాళ్లు చెప్పిందంతా నిజం కాదు. అదంతా రెండు దశాబ్దల కిందటి మాట. ఇప్పుడు కాదు' అని కూల్​గా ఆన్సర్ ఇచ్చాడు. ఈ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్​గా మారింది.

తను చూస్తుంటుంది నేను చెప్పలేను!
కాగా, జీవితంలో మర్చిపోయిన అతిపెద్ద విషయం ఏది అని స్మృతి మరో ప్రశ్న అడిగింది. దీనికి రోహిత్ 'అది నేను చెప్పలేను. ఈ ఇంటర్య్యూ లైవ్ వెళ్తోంది. ఇది మా భార్య చూస్తుంటుంది. అందుకే నేను చెప్పలేను' అని ఫన్నీగా బదులిచ్చాడు. అయితే రోహిత్ తన వెడ్డింగ్ రింగ్ మార్చిపోయాడని నెటిజన్లు కామెంట్​ చేస్తున్నారు.

కాగా, అంతర్జాతీయ, డొమెస్టిక్ క్రికెట్​లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లను బీసీసీఐ నమన్ అవార్డులతో సత్కరించింది. ఈ అవార్డుల్లో దిగ్గజం సచిన్ తెందూల్కర్​కు అరుదైన గౌరవం దక్కింది. బీసీసీఐ సచిన్​ను 'జీవిత సాఫల్య పురస్కారం'తో గౌరవించింది. 2023- 24 సీజన్‌కు గాను ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్‌గా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, మహిళా క్రికెటర్​గా స్టార్ ప్లేయర్​ స్మృతి మంధాన ఎంపికైంది.

'ఓన్లీ లవ్ అండ్ సాడ్ సాంగ్స్​ వింటాను, వాళ్లకు అది నచ్చదు!'- స్మృతి మంధాన

'నువ్వు సూపర్ రోహిత్, ఇందుకే నువ్వంటే మాకిష్టం'- కెప్టెన్​పై నెటిజన్ల ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details