Rohit Sharma Net Practice :టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్లోమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల ముగిసిన ఆసీస్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన హిట్‌మ్యాన్, కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు డొమెస్టిక్ టోర్నీలో బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముంబయి వాంఖడే స్టేడియం నెట్స్‌లో ప్రాక్టీస్ బ్యాటింగ్ చేశాడు. నెట్స్‌తో రోహిత్ తీవ్రంగా చెమటోడ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను హిట్‌మ్యాన్ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు.
నెట్స్‌లో రోహిత్
ప్రాక్టీస్ సమయంలో రోహిత్ కవర్ షాట్లు, కట్ షాట్లు, పుల్ షాట్లు, కవర్ డ్రైవ్ తదితర షాట్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. అలాగే హిట్ షాట్లు, భారీ షాట్లు ప్రాక్టీస్ చేశాడు. అదే విధంగా ప్రాక్టీస్ సమయంలో రోహిత్ ఫుట్ వర్క్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాడు. కాగా, రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అక్కడ టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సైతం ఉన్నాడు.
బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో రోహిత్ శర్మ కఠినమైన షాట్లు ఆడాడు. డ్రైవ్‌ల నుంచి కట్స్ అండ్ పుల్స్ వరకు అన్నీంటినీ రోహిత్ సాధన చేశాడు. రోహిత్ టైమింగ్ అద్భుతంగా అనిపించింది. అతడి ప్రతి షాట్ సక్సెస్ అయింది. రోహిత్ ప్రాక్టీస్ వీడియోను చూసి మళ్లీ అతడు పాత ఫామ్ తిరిగి అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.